34.2 C
Hyderabad
April 19, 2024 21: 20 PM
Slider కరీంనగర్

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ కవ్వంపల్లి ఖరారు

#dr.kavvampally

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించింది. ఈ మేరకు అక్కడ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు ఇన్ చార్జిగా ఉండి ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దీటైన అభ్యర్ధి లేకపోవడంతో అభ్యర్ధి ఎంపిలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.

కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక కోసం గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ఆరు పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపింది. ఏఐసిసి కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మణిక్కం ఠాగూర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లు డాక్టర్ జె గీతారెడ్డి, టి.జయప్రకాశ్ రెడ్డి, ఎం.మహేష్ కుమార్ గౌడ్, మహ్మద్ అజారుద్దీన్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని తమ తమ అభిప్రాయాలను చెప్పారు.

ఈ సమావేశంలో కొండా సురేఖ పేరుపై ఎక్కువ చర్చ జరిగింది. కొండా సురేఖ తో బాటు కృష్ణారెడ్డి, పి.రమేష్ ల పేర్లపై కూడా చర్చ జరిగింది. అయితే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వైపు మెజారిటీ సభ్యులు మొగ్గు చూపినట్లు తెలిసింది.

కవ్వంపల్లి సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం, కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే ఆయన పేనును సూచించడంతో డాక్టర్ కవ్వంపల్లి పేరును ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయిగా చెబుతున్నారు.

Related posts

సింహపురి యూనివర్సిటీలో రన్ ఫర్ ఈక్వాలిటీ

Satyam NEWS

వర్షం లో తడిసి ముద్దవుతున్న విజయనగరం…!

Satyam NEWS

బాధితులకు అండగా నిలవండి

Bhavani

Leave a Comment