36.2 C
Hyderabad
April 25, 2024 22: 05 PM
Slider ముఖ్యంశాలు

కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా

#kalwakurthy

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. టిపిసిసి పిలుపుమేరకు సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డిసిసి అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ రైతులను నిలువు దోపిడీ చేస్తుందని నేటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్న రైతులను ఆదుకున్న ప్రభుత్వాలే కానీ పొట్ట నింపుతున్న రైతన్న లను పొట్ట గొట్టిన ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అని దుమ్మెత్తి పోశారు.పేద రైతుల భూములను అధికార పార్టీలో ఉన్న నేతలు, నాయకులు అధికార మదంతో కబ్జా చేసిన పట్టించుకోని పోలీసులు సంవత్సరాల పొడుగు కోర్టుచుట్టూ తిరగలేక లక్షల్లో లాయర్లకు ఫీజులు చెల్లించలేక దిక్కు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని, ధరణి తెచ్చిందే పొలాలను కబ్జా చేసేందుకని విమర్శించారు.

పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి రైతన్నలను నిలువున వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రుల కోసం రైతుబంధు పథకాన్ని తెచ్చారని అధికార పార్టీ నాయకుల్లో వందల ఎకరాలు ఉండడంతో వారే లక్షాధికార అవుతున్నారు కానీ నిరుపేద రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రుణమాఫీ లక్షల్లో ఉంటుందని ఏదో ఎకరానికి 2000 ,3000 ఇస్తూ రైతులను మభ్యపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకసారి వరి వేస్తే ఉరి అని ధాన్యం ప్రతి గింజ వరకు మేమే కొంటామని అసెంబ్లీలో మాత్రమే చెప్తారని కానీ మార్కెట్ యార్డులో కొనకుండా నీలిమేషాలు వేస్తున్నారని కొన్న చోట్లల్ల క్వింటాలకు 5 కిలోలు ఆరు కిలోలు తరుగు తీస్తున్నారని రైతన్నను తూకాలలో మోసగిస్తూ న్న ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదని తెలిపారు.

ఇతర పంటలు వేయడానికి రైతులకు విత్తనాలు అందుబాటులో లేకుండా ఒరివేస్తే ఊరే అని అన్నదాతలకు అన్నం దొరకకుండా చేస్తున్న ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి రైతు బాగోగులను చూసిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వెల్దండ మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ తర్నికల్ సర్పంచ్ పాండుగౌడ్ యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బండి సుదర్శన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహీముద్ వెల్దండ సింగల్ విండో డైరెక్టర్ నరేష్ చౌదర్ పల్లి వెంకటయ్య అన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కిసాన్ సెల్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, రైతులు, రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నందలూరు శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం టీటీడీ స్వాధీనం

Satyam NEWS

ఎంప్రెస్‌: విశాఖకు విహార నౌక

Satyam NEWS

విధి నిర్వహణలో గాయపడ్డ కానిస్టేబుల్ కు ఎస్పీ పరామర్శ

Bhavani

Leave a Comment