37.2 C
Hyderabad
April 19, 2024 14: 15 PM
Slider ఆదిలాబాద్

నూతన వ్యవసాయ విధానంపై కాంగ్రెస్ పిచ్చి ప్రేలాపన

#BJPNirmal

నూతన వ్యవసాయ బిల్లును కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ కావాలని రైతులను తప్పుదారి పట్టిస్తున్నదని బిజెపి కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు.

ఈ రోజు బీజేపీ నిర్మల్ పార్టీ కార్యలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోక్ సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లు ఎంతో కీలకమైనదని అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశంలో రైతులు అధోగతి పాలు కావడం  చూశామని ఆయన అన్నారు. రైతులకు ఎక్కడా స్వేచ్ఛ లేకుండా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా మార్కెట్లో స్వేచ్ఛగా పంట నమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన అన్నారు.

రైతులను పూర్తిగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పిచ్చిగా మోడీ ప్రభుత్వాన్ని బిజెపిని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నదని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవసాయ బిల్లు రైతులకు అన్ని రకాలుగా మేలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

మొట్టమొదటిసారిగా దేశంలో పండించిన పంటకు రైతు ఎక్కడ ధర లభిస్తే అక్కడ అమ్ముకునే అవకాశం కల్పించారని అన్నారు. అదే విధంగా గిట్టుబాటు ధరలు రావడం రైతు నిర్ణయించిన ధరకు వంట నమ్ముకునే స్థితికి చేరుకోవడం దీనితో దళారుల మోసాలు తగ్గిపోయి రైతు స్వేచ్ఛాయుతంగా మార్కెట్ చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతులు తిప్పికొట్టాలని బిజెపి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఒడిసెల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు కమల్ నయన్ జిల్లా కార్యదర్శి గాదె విలాస్ పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్ నాయకులు అల్లం భాస్కర్ మూడారపు ప్రదీప్ తోట సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నిమ్మగడ్డ కితాబు

Satyam NEWS

పల్నాడులో ఫోన్‌ సిగ్నల్స్‌ ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

రామప్ప కు యునెస్కో గుర్తింపు: ప్రపంచ వారసత్వ హోదా

Satyam NEWS

Leave a Comment