32.2 C
Hyderabad
March 28, 2024 23: 13 PM
Slider మహబూబ్ నగర్

రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ: రంగినేని అభిలాష్ రావు

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని, వరంగల్ డిక్లరేషన్ రైతులకు భరోసా ఇచ్చిందని కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు పేర్కొన్నారు. టీపీసీసీ అద్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి రచ్చబండ కార్యక్రమంను పిలుపు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శనివారం కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రంగినేని అభిలాష్ రావు చిన్నంబావి మండలం,చెల్లపాడు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం గ్రామస్తులతో కలసి నిర్వహించడం జరిగింది.అభిలాష్ రావు మొదటగా తన స్వంత గ్రామం అయిన వెంకటాంపల్లిలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి వారిని కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులతో కలిసి దర్శించుకోవడం జరిగింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన రైతు డిక్లరేషన్ వివరాలను కాంగ్రెస్ నాయకులు రంగినేని అభిలాష్ రావు గారు గ్రామస్తులతో కలసి వాల్ పోస్టర్ లను మరియు కర పత్రాలను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా రంగినేని అభిలాష్ రావు మాట్లాడుతూ రైతులకు రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రవేశపెట్టడం జరిగిందని కావున ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త నెల రోజుల పాటు రైతులతో మమేకమై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతాంగానికి మేలు చేసే అంశాలు సవివరంగా గడప గడపకు వెళ్లి వివరించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంటే శివన్న ,జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రటరీ రఫీ ఉద్దీన్,కవి రచయిత స్పోక్స్ పర్సన్ మహమ్మద్ ముస్తఫా,జిల్లా మహిళా నాయకురాలు శ్రీలత రెడ్డి ,వీపనగండ్ల మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ,వీపానగండ్ల మండల అధ్యక్షుడు గోధల బీరయ్య యాదవ్, పెంట్లవెల్లి మండల అధ్యక్షడు నరసింహ యాదవ్,వీపనగండ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్,చిన్నంబావి మండల యూత్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ మధు సుధన్ గౌడ్, చిన్నమారు గ్రామ పార్టీ అధ్యక్షుడు అలిపిరి,ఎల్లురు గ్రామ అధ్యక్షుడు పరుశురాం యాదవ్,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామకృష్ణ, మనోహర్, నరసింహ,పుల్లయ్య,వల్లస్వామి, పెద్ద బాలస్వామి,కోటకొండ వెంకటయ్య,చిన్న బాలస్వామి, మరికంటి నరసింహ, అంకన్న, కుక్కన, బుక్కపురం రాముడు,గంగన్నల్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, కొల్లాపూర్

Related posts

15 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ ఉత్తర్వులు

Satyam NEWS

మన ఊరు-మన బడి పనులు త్వరగా పూర్తి చేయాలి

Murali Krishna

హోలీ సంబరాల్లో కలెక్టర్

Murali Krishna

Leave a Comment