31.7 C
Hyderabad
April 25, 2024 00: 29 AM
Slider ముఖ్యంశాలు

వైఎస్ఆర్ ను మరిచిన కాంగ్రెస్

తన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన మహనీయుడు వైఎస్ఆర్ అని అలాంటి మహానియుని ఆ పార్టీ మర్చిపోయిందని వైఎస్ఆర్టిపి కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి నీలం రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని, వైఎస్ ఆర్ విగ్రహాలకు అక్కడక్కడ పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ అవకాశవాదాన్ని ప్రదర్శిస్తుందన్నారు.

వైఎస్ఆర్ సంక్షేమ పాలన తేవాలన్న ఆలోచన ఆ పార్టీకి లేదని వ్యాఖ్యనించారు. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చి రాజకీయం చేస్తోందన్నారు. రైతుల కోసం పని చేయడంలో ఆ పార్టీ విఫలమైందన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగేలా ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారన్నారు. రైతుల శ్రేయస్సు కోసం తాము ఎలాంటి గొడవల జోలికి వెళ్లడం లేదన్నారు. ఎన్నికల కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం ఏ పార్టీ పని చేయడం లేదని తెలిపారు.

సీఎం సహా ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడం కాదని, దగ్గరుండి కొనుగోలు చేసేలా చూసుకోవాలని హితవు పలికారు. 2 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ రైతులను విస్మరించారని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతూ మత రాజకీయాలు చేస్తోందని మతాల కోసమే బీజేపీ పోరాటమని విమర్శించారు.

వైఎస్ఆర్ సేవలను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరని, అనేక పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని తెలిపారు. రాజన్న సంక్షేమ పాలన రావాలంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కూతురు షర్మిల నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ తాహెర్, యూత్ ఇంచార్జి రాము, నాయకులు సంగమేశ్వర్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Related posts

నిర్మల్ పట్టణం నాలుగు రోజులు పూర్తి లాక్ డౌన్

Satyam NEWS

మహిళలపై నేరాలను ఆపేందుకు అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

నిత్యావసరాలు పంచిన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్

Satyam NEWS

Leave a Comment