26.2 C
Hyderabad
December 11, 2024 20: 44 PM
Slider ఖమ్మం

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

#Ponguleti

ఏ ప్రజలు అయితే కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం అప్పగించారో ఆ ప్రజల నమ్మకాన్ని చురగొనే విధంగా, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో తొలిసారి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ప్రజాపాలనకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కావాలని కోరుకున్నారో ఏదైతే ఆశించారో వారి అభిలాషకు అనుగుణంగా వాటన్నిటిని సంతృప్తి పరచుకుంటూ ఎవరు ప్రవేశపెట్టనటువంటి అమలు పరచలేనటువంటి పథకాలను ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని అమలుపరుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రకటించిన హామీలను ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా బడ్జెట్ రూపొందించి నిధులు కేటాయించడం జరిగింది.

బడ్జెట్ ను చీల్చి చెండాడుతామని  ప్రతిపక్ష నేత కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ బడ్జెట్ గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన కేసిఆర్ కు ఒక కనువిప్పు. తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయిన ప్రతిపక్ష నేత కేసిఆర్  ఈ బడ్జెట్ ను విమర్శించడానికి  కూడా ఏమి లేదు. మొదటిసారి వచ్చారు కాబట్టి, ఏదో ఒకటి మాట్లాడాలని తన సహజ ధోరణిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఈ రాష్ట్రాన్ని వారు ఆర్థికంగా ఎంతో చిన్నాభిన్నం చేసి, తెలంగాణ సమాజం కోలుకోలేని దెబ్బ తీశారు.

ముఖ్యమంత్రిగా చీల్చి చెండాడి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే ధోరణిలో మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది నెలల క్రితమే చీల్చి చెండాడి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.  ఎన్నో అన్నాయాలతో అక్రమాలతో అవినీతితో ఖాళీ ఖజానాను మా ప్రభుత్వానికి అప్పగించారు. ఎంతో సమర్థవంతంగా ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రతిపక్షంలోని కొంతమంది పెద్దలు నోరు మెదపడానికి కూడా రాని విధంగా బడ్జెట్ ను ప్రవేశ పెడితే ఇటువంటి ప్రజారంజక బడ్జెట్ ను చీల్చి చెండాడుతారా అని ప్రశించారు.

Related posts

బెయిల్ రద్దుకు నిరాకరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

Satyam NEWS

జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనం…!

Bhavani

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

Satyam NEWS

Leave a Comment