31.7 C
Hyderabad
April 24, 2024 23: 09 PM
Slider కరీంనగర్

ఈటల రాజేందర్ ప్రత్యర్థి ఇప్పుడు ఇక టీఆర్ఎస్ లోకి..?

#PadiKowshikReddy

హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారా? ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇదే నిజం అనిపిస్తున్నది. పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక నేతలను ఆదేశించినట్లు తెలిసింది.

ఈ మేరకు జిల్లాకు చెందిన ఒక మంత్రి కౌశిక్ రెడ్డి తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలో ఈటెల ను  డీ కొట్టాలంటే కౌశిక్ రెడ్డి తప్ప మరో మార్గం లేదని కెసిఆర్ కు సదరు మంత్రి తెలిపినట్లు సమాచారం.

దీంతో కౌశిక్ రెడ్డి ని పార్టీ లోకి చేర్చుకునేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈటెల తేరుకుని పార్టీ కి నష్టం చేసే లోపే ఇంఛార్జి ని నియమించి క్యాడర్ ను కాపాడుకోవాలని భావిస్తూ పావులు కదుపుతున్నారు.

అంతవరకు నిత్యం ఈటెల వెంట ఉండే  కొంతమంది సెకండ్ క్యాడర్ నాయకులతో కెసిఆర్ డైరెక్ట్ గా అవసరమైతే మాట్లాడి ఆత్మ స్థైర్యం నింపాలని, ఇందులో భాగంగానే బీసీ సంఘం నాయకుడు వకుళాభరణం కృష్ణ మోహనరావు ను రంగం లోకి దించి ఈటెల కు వ్యతిరేకంగా డిబేట్ లలో మాట్లాడి స్తున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా ఒకవేళ కెసిఆర్ వ్యూ హం పాలించి కౌశిక్  తెరాస తీర్థం పుచ్చుకుంటే నియోజక వర్గ రాజకయాలు రసవత్తరం అవుతాయని భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలు మాత్రం తమ నాయకుడు కౌశిక్ పార్టీ వీడడదని,తెరాస లోకి వెళ్ళడదని చెబుతున్నారు.

Related posts

ఆనంద్ తేల్తుంబ్దే, గౌతమ్ నవలఖాల అరెస్టు ఖండిస్తున్నాం

Satyam NEWS

వరి పంట అడుగులో డీఏపీ నే వాడాలి

Satyam NEWS

రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై పటిష్టమైన నిఘా

Satyam NEWS

Leave a Comment