39.2 C
Hyderabad
April 23, 2024 18: 26 PM
Slider వరంగల్

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

#setakka

పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుందని, కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు రెండు ప్రభుత్వాలు చేస్తున్న నియంతృత్వ నిరంకుశ విధానాలను ప్రజలకు వివరించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షులు చిటమాట రఘు ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని మాట్లాడుతూ ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాలు విడిచిన కుటుంబం అని అన్నారు. దేశ ప్రజల అభ్యున్నతి కోసం ప్రజల, అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆమె కోరారు.

ప్రజలను రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు కులం మతం ప్రాంతం అని విభజించు పాలించు పద్ధతులను చేస్తున్న కేంద్ర ప్రభుత్వా నిరంకుశ వైఖరిని అంతమొందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ దేశం అందరిదీ ఏ ఒక్క కులానిది ఏ ఒక్క ప్రాంతానిధి కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కు దేశం మీద హక్కు ఉంటుందని ప్రతి పౌరుని హక్కుల కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించారని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ గారు నిస్వార్థ నాయకులని ఆయన పాదయాత్రకు విశేష స్పందన ప్రజల నుండి వస్తుందని ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారని సీతక్క అన్నారు.

మోడీ ప్రభుత్వం అని ప్రజల బాధను ప్రజల ఆవేదనను అర్థం చేసుకోలేని ప్రభుత్వం ఎందుకని ఆమె ప్రశ్నించారు. డిజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి అన్ని రకాలుగా పేద మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నారని కూరగాయల రేట్లు పెరిగి ఆయిల్ నిత్యవసర సరుకుల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటి పేద ప్రజలు జీవన విధానం కూడా దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేటీకరణ పేరుతో వారి మిత్రులు అదానీ, అంబానికి దార దత్తం చేస్తున్నారని ప్రభుత్వ సంస్థలన్నీ అన్నిటిని మిత్రులకు కట్టబెట్టి వారి కోసం మాత్రమే పనిచేస్తున్నారని సీతక్క విమర్శించారు.

టిఆర్ఎస్ బిజెపి చేస్తున్న నిరంకుశ పాలన విధానాలను గ్రామ గ్రామాన తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. అలాగే ములుగు జిల్లాలో కూడా కొంతమంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇదికరెక్ట్ కాదని సీతక్క అన్నారు.

కొంతమంది స్వార్థపూరిత నాయకులే అసత్య ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆమె అన్నారు. ఏటూరు నగరంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని అలాగే ములుగులో అధునాతన బస్టాండ్ నిర్మించాలని అధికారులకు ప్రభుత్వానికి విన్నవించామని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు అయూబ్ ఖాన్, బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింగరావు,

జిల్లా సీనియర్ నాయకులు ఎండీ ఖలీల్ ఖాన్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,ఎంపిటిసి గుండ్ల శ్రీలత-దేవేందర్,కన్నాయిగూడెం జడ్పీటీసీ నమ కరణ్ చంద్,కన్నాయిగూడెం అధ్యక్షులు ఎండీ అప్షర్ పాషా,టౌన్ అధ్యక్షుడు ఎండీ సులేమాన్,వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీను,జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ గౌస్,PACS వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు ఉపసర్పంచ్ కర్ల అరుణ, భాగ్య ,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య, ,

PACS డైరెక్టర్ వంగపండ్ల రవి యాదవ్,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య ,రియాజ్,మహిళా నాయకురాలు కట్కూరి భాగ్య,జిల్లా,మండల అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా ఇంచార్జి గద్దల నవీన్ ,మామిడి రాంబాబు, సాధన పల్లి లక్ష్మయ్య, ముస్తఫా, అజ్మత్, టౌన్ ప్రధాన కార్యదర్శి గుండెల శ్రీను,కిరణ్,

మండల సోషల్ మీడియా సోదారి హరీష్, సునార్కని శ్రీను, ముతేష్,దుర్గం అర్జున్, తూర్పాటి కుమారస్వామి, అల్లం వారి గణపురం సర్పంచ్ పలక చిన్నన్న,అజ్మాత్,ప్రకాష్ ,జిమాడ రవి,కళ్యాణ్, కావిరి మొండయ్య, దొంగిరి మధుబాబు,ఉమ్మనేని రమేష్,తుర్పటి కుమారస్వామి, బీసీ సెల్ అధ్యక్షులు కుదురుపక శ్రీను,యూత్ నాయకులు తదితరులు  పాల్గొన్నారు. 

Related posts

జర్నలిస్టులకు ఇంటి స్థలం మంజూరు చేయాలి

Satyam NEWS

విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్‌ను ప్ర‌త్యేకంగా అభినందించిన మంత్రి బొత్స

Satyam NEWS

బతుకమ్మ, విజయదశమి పండుగలపై విద్వత్ సభ నిర్ణయం

Satyam NEWS

Leave a Comment