దేశ చరిత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన అమలు చేసిన నాలుగు సంక్షేమ పథకాలను ఆదివారం ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను అమలు చేసిందని అన్నారు.
గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందనప్పటికి, పేదలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో పేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రకటించనున్నదని అన్నారు. హామీల అమలు విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రతిపక్షాల ప్రచారాలను నమ్మి ఆగం కావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భుజంగ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జెడ్ పి టి సి సోనియా సంతోష్ రాథోడ్, బాపయ్య, రఫీ, ఏల్చల్ గంగారెడ్డి తదితరులు ఉన్నారు.