39.2 C
Hyderabad
April 25, 2024 17: 33 PM
Slider హైదరాబాద్

కరోనా కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్ విఫలం

#Anjan kumar yadav

హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో తక్షణమే సౌకర్యాలు కల్పించాలని మాజీ ఎంపి, హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు ప్రగతి భవన్ కు తిరుగుతూ కాలం వృధా చేస్తున్నారని ఆయన అన్నారు.

కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కరోనా సమయంలో ఉపయోగించుకోకుండా పాత సచివాలయాన్ని కూల్చి వేయడం అన్యాయమని ఆయన అన్నారు. సచీవాలయ భవనాలను కనీసం వెయ్య పడకల ఆసుపత్రి గా మార్చవచ్చునని, కరోనా సమయంలో సచీవాలయ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. అలాంటిది ఆ భవనాలను కూలగొట్టడం అన్యాయమని ఆయన అన్నారు.

ఇదేనా బంగారు తెలంగాణ అని ఆయన ప్రశ్నించారు. బంగారు తెలంగాణ మార్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే దాన్ని కేసీఆర్ శ్మశాన తెలంగాణ గా మారుస్తున్నారని అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు.

Related posts

కాశ్మీర్ విభజనకు రాజ్యసభ ఆమోదం

Satyam NEWS

కరీంనగర్ లో టిటిడి బాలాజీ ఆలయ శంకుస్థాపన

Satyam NEWS

ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Sub Editor

Leave a Comment