Slider జాతీయం ముఖ్యంశాలు

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్టు

Chidambaram-Congress

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ను ఎట్టకేలకు సిబిఐ అరెస్టు చేసింది. అంతకు ముందు ఆయన ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆయనను అరెస్ట్‌ చేసేందుకు ఢిల్లీలోని జోర్‌బాగ్‌లో ఉన్న ఆయన నివాసానికి సీబీఐ, ఈడీ అధికారులు వెళ్లారు. అంతకు ముందు కాంగ్రెస్‌ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి  అనంతరం ఎక్కడికో వెళ్లిపోయారు. చిదంబరం ఇంటికి చేరుకున్నసిబిఐ అధికారులు ఇంట్లోని వారిని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం.. ఈడీ, సీబీఐ అధికారులు మళ్లీ ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. చిదంబరం వ్యక్తిగత సిబ్బంది గేట్లు వేసి అడ్డుకున్నారు. దీంతో సీబీఐ అధికారులు గోడ దూకి లోనికి ప్రవేశించారు. చిదంబరం అరెస్ట్‌ కోసం దిల్లీ పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు.

Related posts

శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం టీటీడీ స్వాధీనంకు రంగం సిద్ధం…

Satyam NEWS

పిచ్ఛ పిచ్చగా నచ్చేసే పీప్ షో: ఆటో రాంప్రసాద్ అదరగొట్టేసాడు

Satyam NEWS

భారతరత్నం పీ.వీ

Satyam NEWS

Leave a Comment