కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని, దాడులకు పాల్పడాలని బీఆర్ఎస్ నేతలు పథకం రచిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కేటీఆర్ ఆత్మ, బినామీ అయిన తేలుకుంట్ల శ్రీధర్ ఈ మేరకు కుట్రలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గానికి కోటి రూపాయలు పంపించి దాడులు చేయించడానికి చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన అన్నారు.
లగచర్ల ఘటన లాగా మరో సారి కేటీఆర్ కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కేటీఆర్ ..నీ కుట్ర లకు మేము భయపడం… దొంగే దొంగ అన్నట్లు గా కేటీఆర్ తీరు ఉంది… బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ బంధువుల పార్టీ గా మారింది… బావ కళ్లలో ఆనందం కోసం హరీష్ రావు అసెంబ్లీ లో అడ్డగోలుగా వ్యవహారిస్తున్నాడు… కేటీఆర్ ను ఏ 1 గా ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యాక అసెంబ్లీ లో చర్చ ఎలా జరుగుతుంది….ధరణి పైన చర్చ జరిగితే తమ భూఆక్రమాలు బయట పడుతాయనే చర్చను అడ్డుకుంటున్నారు అని ఆయన విమర్శించారు.