34.2 C
Hyderabad
April 23, 2024 12: 58 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

బాట మార్చిన కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్

5056_digvijay-singh

ప్రతి సారీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఈ సారి ఎందుకో రూట్ మార్చి హిందువులకు, హిందూ దేవాలయాలకు అనుకూలంగా మాట్లాడారు. వెరైటీగా ఉంటుందని కాబోలు బిజెపి నాయకులు హిందువులకు, హిందూ దేవాలయాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. బిజెపి అధికారంలో ఉన్న భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ నగర శివార్లలో ఒక ఆధునిక కబేళా నిర్మించాలని తలపెట్టింది. అయితే అక్కడ పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలకు కబేళాకు సంబంధం లేదని బిజెపి అంటున్నది కానీ పవిత్రమైన దేవాలయాల మధ్య కబేళా ఎలా నిర్మిస్తారని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నిస్తున్నారు. నవరాత్రి ఉత్సవవాలలో భాగంగా వేలాది మంది హిందువులు అక్కడి కంకాళి మందిరానికి వస్తారని ఆ ప్రాంతంలో కంకాళి మందిరం ఒక్కటే కాకుండా ఇస్కాన్ టెంపుల్, అతి పురాతనమైన రామ మందిరం కూడా ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ అన్నారు. హిందూ దేవాలయాలు ఉన్న స్థలంలో కబేళా ఎలా పెడతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. స్థానికులు ఎన్ని సార్లు అభ్యంతరాలు తెలిపినా భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ అలోక్ శర్మ వినిపించుకోవడం లేదు. దాంతో దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి జయవర్ధన్ సింగ్ కు లేఖ రాశారు. అప్పటిలో బిజెపికి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉండి భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ పంపిన ఈ కబేళా ప్రతిపాదనలను అంగీకరించారని, ఇది ఆ ప్రాంత హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని దిగ్విజయ్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దేవాలయాల మధ్య ఉన్నకబేళాను మూసివేయాలని ఆయన కోరారు. అన్నట్టు… ఒక విషయం… మునిసిపల్ వ్యవహారాలశాఖ మంత్రి జయవర్ధన్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కుమారుడే.

Related posts

అక్సిడెంట్:బస్సు ఢీకొని మామ మృతి కోడలికి గాయాలు

Satyam NEWS

గుజరాత్ లో రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

Sub Editor

గ్రామాల అభివృద్ధికి సాయం అందిస్తాం

Bhavani

Leave a Comment