28.7 C
Hyderabad
April 25, 2024 04: 42 AM
Slider నల్గొండ

పోలీస్ రిక్రూట్మెంట్ లో నిబంధనలు సడలించాలి

#congress

పార్టు-2 ఎస్సై,కానిస్టేబుల్ అభ్యర్థులకు కొన్ని స్కూల్ సర్టిఫికేట్లకు మినహాయింపు ఇవ్వాలని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పత్రికా  విలేఖరులతో మాట్లాడుతూ ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

పార్టు-2 అప్లికేషన్ గడువును పొడిగించాలని,పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో కొత్త తిరకాసులతో ఇబ్బందులు పడుతోన్న అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.కానిస్టేబుల్‌, ఎస్‌ఐ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారిందని, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో తిరకాసు పెట్టిందని,స్టడీ సర్టిఫికెట్ల సమస్య తెచ్చిందని అన్నారు. ఒకటో తరగతి నుంచి మొత్తం స్టడీ సర్టిఫికెట్లు కావాలనడంతో పాటు డిగ్రీ సర్టిఫికెట్లు కూడా 2022 జూన్‌ ఒకటో తేదీ లోపు ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నారని,వీటన్నింటితో తమ ఆశలపై నీళ్లు చల్లారంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో పార్టు-2 దరఖాస్తు ప్రక్రియలో గందరగోళం ఏర్పడిందని,మరోవైపు సమస్యలు, సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లూ కలవడం లేదని,దాంతో పార్టు-2 దరఖాస్తు ప్రక్రియను పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారని అజీజ్ పాషా అన్నారు.

జులై నెలోగా డిగ్రీ సర్టిఫికెట్లు ఎలా సాధ్యమని,పోలీసు శాఖకు చెందిన ఈ రెండు విభాగాల ఉద్యోగాల కోసం 2022 జులై 1వ,తేదీ నాటికి సంబంధిత విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే, కరోనా ప్రభావంతో మే నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు జూన్‌,జులై నెలలో జరిగాయని,వాటి ఫలితాలు ఆగస్టు రెండో వారంలో వెలువడ్డాయని,పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్‌లో జులై 1లోపే డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలని పేర్కొనడంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొందని,డిగ్రీ చివరి సంవత్సరం రాసిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఎస్‌ఐ పరీక్షల్లో అర్హత సాధించారని,వారంతా ఇప్పుడు పార్టు-2లో ఎస్‌ఐ,కానిస్టేబుల్‌కు దరఖాస్తు చేసుకోవాలా లేక కానిస్టేబుల్‌కే దరఖాస్తు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.

సర్టిఫికెట్లు జులై తర్వాత అందడంతో ఎస్‌ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందో లేదో తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లకు అభ్యర్థులు ఫోన్‌ చేస్తున్నారని, అయినా స్పందన లేదని, పార్టు-2 దరఖాస్తుల్లో 1వ,తరగతి నుంచి 7వ,తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లతో పాటు కుల ధృవీకరణ పత్రాలు,బిసి అభ్యర్థులకు నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్లను పొందుపర్చాలని బోర్డు సూచించిందని, ఇప్పుడు వాటి కోసం వివిధ మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ అభ్యర్థులు తిరుగుతున్నారని,తహశీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీకి ఎక్కువ సమయం తీసుకోవడం,మరోపక్క పార్టు-2 అప్లికేషన్‌కు చివరి తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.

స్థానికత కోసం పార్టు-2లో 1వ,తరగతి నుంచి 7వ,తరగతి వరకు బోనఫైడ్స్‌ జత చేయాల్సి ఉందని,అవి ఉంటేనే కంప్యూటర్‌ దరఖాస్తులను స్వీకరిస్తుందని, దానితో సర్టిఫికెట్ల కోసం (20-25 ఏండ్ల కిందట) ఎప్పుడో చదివిన పాఠశాలలకు అభ్యర్థులు పరుగులు తీస్తున్నారని,కొన్ని చోట్ల ఆ పాఠశాలలు లేకపోవడం, మరికొన్ని చోట్ల ఆ పాఠశాలలు వేరే పాఠశాలలో విలీనం కావడం,ఇంకొన్ని చోట్ల పాఠశాలలు రద్దు కావడంతో అభ్యర్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని అజీజ్ పాషా అన్నారు.

ఒకవేళ చదువుకున్న పాఠశాలలున్నా యాజమాన్యాలు మారడం,ఇంకొన్ని చోట్ల సర్టిఫికెట్ల కోసం డబ్బులు డిమాండ్‌ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని,అప్పటి ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు లేవని, స్టడీ సర్టిఫికెట్లు లేనిచోట్ల తహశీల్దార్ కార్యాలయం నుంచి రెసిడెన్సీ సర్టిఫికెట్లు తీసుకోవాలని బోర్డు సూచించిందని,అది ఇవ్వడానికి కూడా అధికారులు విచారణ, ఇతర వివరాల కోసం ముప్పు తిప్పలు పెడుతున్నారని,దానితో అభ్యర్థులు తాహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎస్ఐ,కానిస్టేబుల్ అభ్యర్ధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని మహ్మద్ అజీజ్ పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

చాట్ పూజ ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్ శ్రీ వాణి

Satyam NEWS

విజయనగరం లో రోడ్డెక్కి గళమెత్తిన మీడియా

Satyam NEWS

రైతాంగానికి సాయపడడంలో వైసీపీ ప్రభుత్వ విఫలం

Satyam NEWS

Leave a Comment