Slider హైదరాబాద్

ఉప్పల్ కాంగ్రెస్ నాయకులకు పదవీ బాధ్యతలు

#congress

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షునిగా మాజీ కార్పొరేటర్ మందుముల పరమేశ్వర్ రెడ్డి  నియమితులయ్యారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షునిగా పి సి సి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి  నియమితులయ్యారు. ఈ మేరకు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ నియామక ఉత్తర్వులను అందజేశారు.

బి బ్లాక్ అధ్యక్షునిగా నియమితులైన  సోమశేఖర్ రెడ్డి నియోజకవర్గంలోని ఐదు డివిజన్లకు సంబంధించి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా నియమితులైన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా నియమించిన పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నంది కంది శ్రీధర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఏ  బ్లాక్ అధ్యక్షునిగా నియమితులైన  పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లకు సంబంధించి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా నియమితులైన మంద మల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా నియమించిన పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నంది కంది శ్రీధర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Related posts

ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద

mamatha

వైసీపీకి తలనొప్పిగా మారిన చీరాల వర్గపోరు

Satyam NEWS

మొహం చాటేస్తున్న రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!