ప్రాజెక్టులను అడ్డుకునేందుకు గతంలో కాంగ్రెస్ నేతలు కేసులు వేసిన విషయాలను మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. శాసన మండలిలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కోసం కేంద్రంతో కెసిఆర్ ప్రభుత్వం పోరాడలేదని కాంగ్రెస్ ఎంఎల్సీ జీవన్ రెడ్డి కామెంట్ చేయడంతో హరీష్ రీకౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వకుండా కాంగ్రెస్ గతంలో తప్పుచేసిందని గుర్తు చేశారు. తమ హయాంలో కట్టిన ప్రాజెక్టులతో కోటి ఎకరాలు నీరు అందిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ నేతలు ఆటంకం కలిగిస్తుండడంతో ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రయోజనాలు కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మకపోవడంతోనే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైందని, ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు బుద్ది తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ చేసిన మంచి పనులను గుర్తించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ నేతలకు హరీష్ సూచించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు మేల్కొని తెలంగాణ అభివృద్ధికి తొడ్పాటు అందించాలన్నారు.
previous post