32.2 C
Hyderabad
April 20, 2024 19: 44 PM
Slider నల్గొండ

ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్న నరేంద్ర మోదీ

#congress

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించే గళాన్ని నొక్కేందుకు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్ నందు శనివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్,పిసిసి అధికార ప్రతినిధి దొంగరి వెంకటేశ్వర్లు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాచిమంచి గిరిబాబు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడుపు మహేష్ గాడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బారావు, అంకతి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ అధికారం కోసం కులాల పేరిట,మతాల పేరిట చీల్చాలని బిజెపి పార్టీ   ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ భారత జాతిని ఏకం చేసేందుకు భారత జోడో యాత్ర చేపట్టారని అన్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ ని విదేశాల నుంచి వెనక్కి రప్పించడంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ  ప్రభుత్వం విఫలమైందని,పార్లమెంట్ లో ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారని ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా వ్యక్తిగత కక్షలతో ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తారో చెప్పడానికి రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు ఒక నిదర్శనమని అన్నారు. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నిందితులు నీరవు మోడీ,లలిత్ మోడీ లను వెనక్కి రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందడంతో పాటు అండగా నిలుస్తున్నారనే భావన వచ్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ కి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజని అన్నారు.ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని రద్దు చేయడమని విమర్శించారు.

భారతదేశంలో కేరళ లోని వాయినాడు నియోజకవర్గం నుండి రాహుల్ గాంధీ అత్యధికంగా 12 లక్షల 76,945 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారని వారు గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని గుర్తు చేశారు. యూపీఏ పాలనలో నిరుపేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపేందుకు ఎన్.ఆర్.ఈ.జీఎస్ పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని,పాలనలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని,రైతులకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు అమలు చేసేందుకు ఎఫ్ సి ఐ కి అండగా నిలిచేలా బలోపేతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు.

యూపీఏ పాలనలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 105 కు పెరిగిన పెంపు భారం సామాన్య ప్రజలపై పడనీయకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భరించిందని అన్నారు. దేశంలోని రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, బొగ్గు గనులు ఒక వ్యక్తి చేతిలో ఒకే వ్యక్తి వ్యాపారం కిందికి మార్పిడి చేస్తూ దేశ సంపద కొల్లగొడుతుండడాన్ని ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు.

దేశ సంపదను అదానీ కొల్లగొడుతుంటే వాస్తవాలు వెలికి తీసేందుకు జేపీసీ నియామకం చేపట్టాలని ప్రతిపక్షాలు అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చిన స్పందన కరువైందని అన్నారు.నీతి,నిజాయితీకి, నిరాడంబరతకు నిదర్శనం రాహుల్ గాంధీ అని,ఆయన వెంట దేశ ప్రజలు ఉన్నారని అన్నారు.రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు చేయడం ప్రజాస్వామ్యనికే చీకటి రోజని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ తేజావత్తు రాజా నాయక్,కోతి సంపత్ రెడ్డి,జిల్లా కార్యదర్శి జుట్టుకొండ సత్యనారాయణ,పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురువయ్య,మేళ్ళచెరువు ముక్కంటి, పోతనబోయినా రామ్మూర్తి,చింతకాయల రాము,కాంగ్రెస్ బూత కమిటీ అధ్యక్షులు వెలిదండ వీరారెడ్డి,కోళ్లపూడి, యోహాన్, సులువా చంద్రశేఖర్,కోడి ఉపేందర్,సమ్మెట సుబ్బరాజు,అజ్మతుల్లా,ముశం సత్యనారాయణ,మోదాల సైదులు, లచ్చిమల్ల నాగేశ్వరరావు,నందిగామ శ్రీనివాస్,బుల్లెద్దు కార్తీక్,దొంతగాని జగన్, షేక్ ఉద్దండు,సంక్రాంతి కోటేశ్వరరావు, పులిచింతల అంజిరెడ్డి,పుట్ట గోవింద్, కుందూరి శ్రీనివాస్ రెడ్డి,రెక్కల ఆదిరెడ్డి, రవి,తెప్పని యలమంద,యూత్ కాంగ్రెస్ శ్రేణులు కందుల వినయ్,పులి బాలకృష్ణ, కస్తాల రవీందర్,రెడపంగు రాము, బచ్చలకూరి కృష్ణ,కందుకూరి రాము, పానుగోతు శివ,సంజయ్ నాయక్,నర్సింగ్ ఉపేందర్,ఐలవీర కృష్ణ,అధిక సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

కమిట్ మెంట్: ఇక పట్టణాల రూపురేఖలు మార్చేస్తాం

Satyam NEWS

కొల్లాపూర్ లో అధికారి సంతకం ఫోర్జరీ: అయినా పోలీస్ కేసు లేదు

Satyam NEWS

జగన్ హెచ్చరించిన ఎమ్మెల్యేల జాబితా లో….

Satyam NEWS

Leave a Comment