32.2 C
Hyderabad
March 28, 2024 21: 26 PM
Slider నల్గొండ

రాహుల్ గాంధీ పట్ల పోలీసుల ప్రవర్తన సరికాదు

#HujurnagarCongress

ఉత్తర్ ప్రదేశ్ లోని హోత్రాస్ లో 19 సంత్సరాల దళిత అమ్మాయి మనీషా వాల్మీకి ని నలుగురు ఉన్మాదులు అత్యాచారం చేసిన సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. రకరకాలుగా చిత్రహింసలతో అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను అత్యంత కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేసింది.

 సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పట్ల యూపీ పోలీసులు ప్రవర్తించిన తీరుకు పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి శాంతి స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ UP లోని బాధిత కుటుంబాన్ని పరామర్శించటానికి వెళుతుంటే UP పోలీసులు అత్యంత దారుణంగా అరెస్ట్ చేయటం, లాఠీఛార్జ్ చేయడం సరికాదని అన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చటం నేరమా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో దళితులకు, మహిళలకు రక్షణ కరువైందని అనటానికి ఇదే తార్కాణమని అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన రాహుల్ గాంధీ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు హేయమైన చర్యగా,  అభివర్ణించారు.

దళితులను ఓదార్చటానికి వెళ్ళిన నాయకులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని అన్నారు. బీజేపీ పాలనలో దేశంలో రక్షణ లేకుండా పోయిందని, దురాగతానికి పాల్పడిన మానవ మృగాలను శిక్షించే అంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్షాల నిరసన

Satyam NEWS

తెలుగు పబ్ @ కూచిపూడి వెంకట్ మారేడుమిల్లి

Satyam NEWS

మరింతగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Satyam NEWS

Leave a Comment