39.2 C
Hyderabad
April 25, 2024 18: 17 PM
Slider మహబూబ్ నగర్

పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని ఆర్.డి.ఓ కు వినతిపత్రం

#Vamshichand Reddy

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి శనివారం కల్వకుర్తి ఆర్డీవో కు వినతిపత్రం పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

దేశం మొత్తం కరోనో మహమ్మారి ప్రజలను పీల్చి పిప్పి చేస్తుంటే, కరోనా తో దేశ వ్యాప్తంగా ప్రజలు ఉద్యోగాలు పోయి, ఉపాధి కరువై, జీతాల్లో కోతతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు అండగా ఉండి వారికి భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన పాలకులు పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టానుసారంగా పెంచడం దారుణమని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.

శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఆర్ డి ఓ రాజేష్ కుమార్ కు పెరిగిన ధరలు తగ్గించాలని వినతిపత్రం సమర్పించి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో గతంలో ఎన్నడూ లేని విదంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఈలాంటి విపత్కర పరిస్థితుల్లో ధరలు పెంచడం ఈ పాలకుల ధమన నీతికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.

తక్షణమే పెట్రో ధరల పెంపు ఉపసంహరించుకోవాలి

గత నెల 16వ తేదీననే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పెట్రోల్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారని అన్నారు. నేడు హైద్రాబాద్ లో పెట్రోల్ లీటర్ కు 84.02 రూపాయలు, డీజిల్ రూ.79.19 గా ఉందని ఆయన అన్నారు.

ధరలు పెంచడం వల్ల ప్రజలపై 2 లక్షల 60 వేల కోట్ల అధిక భారం పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో క్రూడాయిల్ ధర అంతర్జాతీయంగా డ్రమ్ముకు 107 డాలర్లు ఉంటే అప్పుడు పెట్రోల్ లీటర్ 71 రూపాయలకు, డీజిల్ 55.50కు అమ్మారని కాగా  నేడు క్రూడాయిల్ ధర విపరీతంగా పడిపోయిందని ఆయన తెలిపారు.

ఇప్పుడు డ్రమ్ముకు 40.66 డాలర్లు మాత్రమే ఉందని ఇలాంటి సమయంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గించాలని కానీ విచిత్రంగా కేంద్రం విపరీతంగా ఎక్సజ్ సుంకం పెట్రోల్ పైన లీటరుకు 32.98 రూపాయలు, డీజిల్ కు 31.82 రూపాయలు వేసి సామాన్యుల నడ్డి విరుస్తుందని ఆయన విమర్శించారు.

ఖరీఫ్ సీజన్ లో రైతులపై అదనపు భారం

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అదనంగా ఆర్థిక భారం పడుతుందని, నిత్యావసర వస్తువుల ధరాలుకుడా గణనీయంగా పెరుగుతాయని అన్నారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు మేలు చేయాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అథితిలుగా టిపిసిసి  వైస్ ప్రెసిడెంట్  డాక్టర్. మల్లు రవి హాజరయ్యారు.

రాష్ట్ర నాయకుడు బృంగి ఆనంద్ కుమార్ జిల్లా డి సి సి కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ యూత్ అధ్యక్షులు రాహుల్ ,మండల అధ్యక్షులు బాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు శ్రీరాములు గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి నాని యాదవ్ , పట్టణ యూత్   కాంగ్రెస్  అధ్యక్షులు  చంద్రకాంత్ రెడ్డి,కౌన్సిలర్ ఎజాస్ ,శ్రీధర్ రెడ్డి,ఎల్లికల్  రెడ్డి,కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి,ఆరీఫ్, జీలాని ,మహమూద్, శ్రీకాంత్,నరేష్, హుస్మాన్, పడకంటి వెంకటేష్,దున్న సురేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రకాశం జిల్లాలో ప్రపంచంలోనే అతి బుల్లి జింక

Satyam NEWS

గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Satyam NEWS

ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు మృతి

Satyam NEWS

Leave a Comment