33.2 C
Hyderabad
April 26, 2024 01: 39 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసిన కాంగ్రెస్ నాయకులు

కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచుతున్న వంటగ్యాస్ సిలిండర్,పెట్రోల్,డీజిల్ & కరెంట్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన వనపర్తి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు,టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డా.చిన్నారెడ్డి తో కలిసి పాల్గొన్న రంగినేని అభిలాష్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర ధరలు పెంచి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని, ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలపై భారం మోపుతున్న పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్,నూనెలను ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా యాసంగిలో రైతు పండిచే ప్రతి గింజ కోనేవరకు కాంగ్రెస్ పార్టీ రైతుల తరుపున పోరాడుతుందని తెలియజేశారు.

అనంతరం రాస్తారోకో ద్వారా కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడి చేసి నిత్యవసర ధరలను మరియు పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం కాంగ్రెస్ నాయకులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొగిలి సత్యరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య గారు,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజశేఖర్ ,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు వాల్య నాయక్ ,రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, యూత్ నాయకులు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సొంత ఇంటికి చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్

Satyam NEWS

ఇంటర్ లో మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

Satyam NEWS

గవర్నర్ ప్రసంగం రద్దు కేసీఆర్ అహంకారానికి నిదర్శనం

Sub Editor 2

Leave a Comment