29.7 C
Hyderabad
April 18, 2024 05: 57 AM
Slider నల్గొండ

పెట్రోల్, డీజిల్ బహిరంగ దోపిడీకి నియంత్రణ లేదా

#hujurnagar congress

AICC పిలుపు మేరకు,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,నల్గొండ పార్లమెంటు సభ్యుడు, కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశానుసారం  పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ లో ఉన్న పెండ్యాల కోటిలింగం పెట్రోల్ బంక్ ముందు పట్టణ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన నిరసన,ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు,రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్  కుమార్ దేశముఖ్,కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ ఉపాధ్యక్షుడు సుంకర శివరామ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగి ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు మార్కును దాటిందని,ఈ పెరుగుదల వల్ల  అన్ని గృహవసరాలు,నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.గత 13 నెలల్లో పెట్రోల్ పై లీటర్ కు రూ.25.72, డీజిల్ పై లీటరుకు 23.93 పెరిగాయని,ఈ ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని,కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని ధ్వజమెత్తారు.

ఈ బహిరంగ దోపిడీ వల్ల  పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరిగేలా ఉన్నాయని,తక్షణమే రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల  ఆర్థిక మందగమనం,విపరీతమైన నిరుద్యోగం, వేతనాలలో కోత,ఉద్యోగ నష్టాలు,అధిక ధరల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు.ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ  నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. 

ఈ నిరసన కార్యక్రమాలలో పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు దొంతి రెడ్డి సంజీవ్ రెడ్డి,ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాచిమంచి గిరిబాబు,వెలిదండ వీరారెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్,ఎస్ కె. సైదా మేస్త్రి,గంగసాని ఎల్లారెడ్డి,వంగవీటి బ్రహ్మం,ముషం సత్యనారాయణ,పాశం రామరాజు,పోతన బోయిన రామ్మూర్తి,దొంతగాని జగన్, సమ్మెట సుబ్బరాజు,పోతుల జ్ఞానయ్య,జింజిరాల సైదులు, రేపాకుల కోటయ్య,కోల మట్టయ్య,సులువా చంద్రశేఖర్,కోడి మల్లయ్య,తప్పని ఎలమంద,గంజి చంద్రమౌళి,ఎస్ కే. అజ్జు, చౌడ పార్వతి, బ్రహ్మారెడ్డి,దాసరి రాములు, దాసరి పున్నయ,పోక బత్తిని జయరాజు, తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, వేముల ఆనందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఫుట్ బాల్ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథ “డ్యూడ్”

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో 217 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Satyam NEWS

లావణ్య మేకప్ స్టూడియోను ప్రారంభించిన డీసీపీ శిల్పవల్లి

Bhavani

Leave a Comment