33.2 C
Hyderabad
April 26, 2024 01: 52 AM
Slider మహబూబ్ నగర్

హత్రస్ అత్యాచారంపై నేటి సాయంత్రం మహబూబ్ నగర్ లో సత్యాగ్రహం

#Dr.MalluRavi

ఉత్తరప్రదేశ్ లోని హత్రస్ ప్రాంతంలో  ఒక దళిత అమ్మాయిపై అత్యాచారం జరిపిన వారిని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రక్షించడానికి ప్రయత్నిస్తుండటాన్ని నిరసిస్తూ నేటి సాయంత్రం 4:00 గంటలకు సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టవలసిందిగా మాజీ.ఎం.పి., టీపీసీసీ ఉపాధ్యక్షులు డా.మల్లురవి కోరారు.

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బాధిత  కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుంటే వారిని అడ్డగించి కింద పడవేసి ప్రజాస్వామ్యాన్ని పోలీసులు ఖూనీ చేశారని ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్ పోలీసుల అరాచకానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.

జిల్లా ప్రధాన కేంద్రం లో నిర్వహించే ఈ సత్యాగ్రహానికి జిల్లాలలోని ఏఐసిసి నాయకులు, టీపీసీసీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, జిల్లా లోని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,  , జెడ్ పి టి సి, ఎంపీటీసీలు సభ్యులు , అన్ని మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు, 

జిల్లాలోని అన్ని మండలాల కు సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు, యువజన, NSUI, మహిళా కాంగ్రెస్ నాయకులు, పట్టణ, మండల అధ్యక్షులు, దళిత సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు హాజరు కావాలని మల్లురవి కోరారు.

Related posts

ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, పెండింగ్ చ‌లానాల‌పై దృప్టి

Sub Editor

డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Bhavani

పరిపాలన లో న్యాయస్థానాల జోక్యం తగదు

Satyam NEWS

Leave a Comment