Slider తెలంగాణ

బిగ్ మిస్టేక్:కాంగ్రెస్ పార్టీని వీడేది కాకుండే

congress resign bigmistake ds

కాంగ్రెస్ పార్టీని వీడటం తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని,సీనియర్ కాంగీ నేత దిగ్విజయ్ సింగ్ తో పడకపోవడం వల్లే ఆ పార్టీ వీడాల్సి వచ్చిందని టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ రాజకీయాల్లో అనవసరంగా మాట్లాడకూడదన్నఉద్దేశ్యం తోనే తాను మౌనంగా ఉన్నానని అన్నారు.

బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ కుటుంబం దోపకం ఎక్కువయిందని ఆయన ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు చేయొద్దని టీఆర్ఎస్ నేతలకు సూచించారు. దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు తాను ఏం చేశానని తనను ప్రశ్నిస్తున్నా వారు ముందుగా వాళ్లు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామా బాడ్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం తన ఇంటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని డీఎస్ ప్రకటించారు.

Related posts

హాఫ్ బట్:నిజామాబాద్‌లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ బోర్డు

Satyam NEWS

భారత్ జోడో తర్వాత కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో

Satyam NEWS

98 జీవో శ్రీశైలం భూ నిర్వాసితులను మోసం చేసిన ఎమ్మెల్యే బీరం

Satyam NEWS

Leave a Comment