27.7 C
Hyderabad
March 29, 2024 02: 45 AM
Slider ముఖ్యంశాలు

ఆసుపత్రుల్లో సౌకర్యాల కోసం కాంగ్రెస్ యాత్ర

#MalluBhattivikramarka

కరోనా వ్యాధితో తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో యాత్ర చేపడుతున్నామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎల్పీ బృందం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ రాష్ట్ర వ్యాప్త యాత్రను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్టు ఆయన వివరించారు.

ఈ యాత్రలో భాగంగా 33 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ సీఎల్పీ బృందం సందర్శిస్తుందని ఆయన తెలిపారు. వచ్చే నెల 7న జరిగే అసెంబ్లీ సమావేశాల్లోగా యాత్రను ముగించి ఓ నివేదికను రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల కరోనా  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీరి పరిస్థితి ఘోరంగా ఉందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకే బాత్ రూమ్ ఉన్న ఇళ్ళలో ఉంటున్న కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను పట్టించుకోకుండా మొక్కుబడి ప్రకటనలకు పరిమితం అవుతోందని భట్టి విమర్శించారు.

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని,  బాధితులకు మెరుగైన ఉచిత వైద్యాన్ని అందించాలని మరోసారి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆయన అన్నారు.

ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, కార్పొరేషన్లనకు ప్రభుత్వ బ్యాంకు గ్యారంటీల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తోందన్నారు. ఈ అప్పులు రాబోయే రోజుల్లో తీర్చలేని భారంగా మారతాయని, జీతాలు, పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తున్న అప్పులను తీర్చటానికి మద్యం, పెట్రోల్ ధరలను పెంచుతోందని ఆయన అన్నారు.

Related posts

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

Satyam NEWS

మాయావతి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్?

Satyam NEWS

డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Bhavani

Leave a Comment