27.7 C
Hyderabad
April 18, 2024 10: 43 AM
Slider ముఖ్యంశాలు

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల కుట్ర?

#RevanthReddy

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి వారసుడిని ఎంపిక చేసే విషయంలో జరుగుతున్న తతంగం చూస్తుంటే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.

రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయితే తప్ప తెలంగాణ లో పార్టీ బతికే అవకాశం లేదని చాలా మంది మౌఖికంగా చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయ సేకరణ పేరుతో ఎంపికను తీవ్రంగా జాప్యం చేస్తున్నది.

పిసిసి అధ్యక్షుడుగా కాంగ్రెస్ నాయకులకు ఆమోదయోగ్యుడైన వ్యక్తిని నియమిస్తారా? ప్రజలు కోరుకునే వ్యక్తిని నియమిస్తారా? ఈ రెండు ప్రశ్నలకు మధ్య కాంగ్రెస్ పార్టీ నలిగిపోతున్నది.

రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా వత్తిడి

చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకునే వ్యక్తిని పిసిసి అధ్యక్షుడుగా నియమించాలని నిర్ణయించి వారి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

ఇలా అభిప్రాయం చెప్పే వ్యక్తులు అందరూ కూడా వేరే పేరు చెబుతారు తప్ప రేవంత్ రెడ్డి పేరు చెప్పే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి చేపడితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది.

అంటే దాదాపుగా జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ మారిపోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి కనీసం సగం జిల్లాలలో తన అనుచరులను నియమించుకునే అవకాశం ఉంది.

అందువల్ల చాలా మంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఓటు వేసి ఉంటారు.

జీహెచ్ ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్న తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండో సారి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అభిప్రాయ సేకరణే ఒక కుట్ర

నాలుగు రోజులుగా నేతల అభిప్రాయాలు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణికం ఠాగూర్ తెలుసుకున్నారు.

రాష్ట్రంలోని పార్టీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచీ అభిప్రాయాలనూ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ తీసుకున్నారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, డీసీసీ అధ్యక్షులు, కంటెస్టెడ్‌ ఎంపీ అభ్యర్థుల నుంచి ఠాగూర్‌.. విడివిడిగా అభిప్రాయాలను తీసుకున్నారు.

మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షపదవి దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీవ్ర కసరత్తు చేసినట్లే కనిపించింది.

అయితే నివేదిక అందిన తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

రాహుల్ గాంధీ నేరుగా జోక్యం చేసుకుంటే తప్ప రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షపదవి దక్కే సూచనలు కనిపించడం లేదు.

Related posts

కల్వకుర్తిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

Satyam NEWS

ఘనంగా కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

ఎకరాకు 10వేలు

Murali Krishna

Leave a Comment