31.2 C
Hyderabad
April 19, 2024 04: 33 AM
Slider విజయనగరం

లౌకిక వాదానికి ప్రతీక మ‌న భారత రాజ్యాంగం

#constitutionalday

లౌకిక‌వాదానికి ప్ర‌తీక‌..మ‌న భార‌త రాజ్యాంగ‌మ‌ని విజ‌య‌న‌గరం జిల్లా ఎస్పీ దీపిక అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 సం.లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో  నాడు ఘనం నిర్వహించారు. ఈ  సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ – నేటికి భారత రాజ్యాంగం అమలై 72 సం.లు పూర్తయ్యాయన్నారు. భారత రాజ్యాంగం దేశ సార్వభౌమాధికారం, సర్వసత్తాక, స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతున్నదన్నారు. లౌకికవాదమే పునాదిగా రాజ్యాంగాన్నిడా. బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించారన్నారు. భిన్న సంస్కృతులు కలిగిన వ్యక్తులను, మతాలను ఒక తాటి పైన నడిపించిన ఘనత భారత రాజ్యాంగానిదేనన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అనుభవిస్తూనే, బాధ్యతలను కూడా నెరవేర్చాల్సిన అవసరం ప్రతీ పౌరుని పైనా ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవిస్తామని, ప్రతీ వివాదాన్ని శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకుంటామని ఈ సంద‌ర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ ఎం.దీపిక రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, డీసీఆర్ బి సీఐ బి. వెంకటరావు, ఎస్బీ సిఐ ఎన్. శ్రీనివాసరావు, ఆర్‌ఐలు చిరంజీవి, పి.నాగేశ్వరరావు, రమణమూర్తి, మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పాజిటీవ్ రాగానే పరేషాన్ కావద్దు: వైద్యం అందుబాటులో ఉంది

Satyam NEWS

పాడవే…!

Satyam NEWS

మోసం చేసిన ప్రియుడి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కింది

Satyam NEWS

Leave a Comment