28.7 C
Hyderabad
April 20, 2024 08: 42 AM
Slider హైదరాబాద్

ప్రతి జిల్లాలో జర్నలిస్టు భవనాలు నిర్మించాలి

#journalist

తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగంలో కొనసాగుతున్న జర్నలిస్టులందర్నీ ఒక కులంగా పరిగణించి ఇతర కులాలకు ఏ విధంగానైతే పక్కా భవనాలు నిర్మాణం చేస్తున్నారో అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రాలలో అన్నీ  సౌకర్యాలతో కూడిన జర్నలిస్టు భవనాలు నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రతి కులానికి ఆత్మ గౌరవ భవనాలు నిర్మించతలపెట్టిన సిఎం కెసిఆర్ జర్నలిస్టులు ప్రెస్ మీట్ లు నిర్వహించుకోవడానికి ఆత్మగౌరవ  భవనాలు ఎందుకు నిర్మించట్లేదని ప్రశ్నించారు. అహర్నిశలు నిద్రాహారాలు మానివేసి వర్కింగ్  జర్నలిస్టులు ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ప్రజా సమస్యలు ప్రభుత్వానికి చేరవేస్తూ వారధులుగా నడుస్తున్న జర్నలిస్టులను ఎందుకు విస్మరిస్తున్నారో రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టుల్లో సందిగ్ధం తో కూడిన ప్రశ్నగా మిగిలిందన్నారు.

పక్కా జర్నలిస్టు భవనాలు లేక అద్దె భవనాలలో ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారని అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ లు లేక చెట్ల కింద హోటళ్లలో గడపాల్సిన వస్తున్నదని అన్నారు. ఇదంతా గమనిస్తున్న సామాన్య ప్రజలు జర్నలిస్టులకు ఠికానా లేదని చులకనగా చూసే ప్రమాదం కూడా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో జర్నలిస్టులది ప్రధానమైన కీలకపాత్రగా ప్రభుత్వం గుర్తుంచుకోవాలని కోరారు.

దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల నియోజకవర్గ కేంద్రాలలో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్‌లు నిర్మించాలని కోరారు. ప్రెస్  అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ  సంబంధిత శాఖ ఉన్నతస్థాయి అధికారులు తమ గోడును పట్టించుకోవాలని విన్నవించారు. మా బతుకులు బాగు పడ్డాయి మాకేం పర్వాలేదు మేము బాగా సెటిల్ అయ్యాము అనుకొని ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందని జర్నలిస్టుల సంక్షేమం  కోసం పోరాటం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మీడియాను అడ్డుపెట్టుకుని  అహర్నిశలు తమ బాగుకోసమే ఆలోచన చేసే స్వార్థ పూరితమైన జర్నలిస్టు పెద్దలు అందరి సంక్షేమం కోసం ఆలోచన చేయాలని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోరుకునే ప్రతి జర్నలిస్టు ఐక్యమత్యంతో ఉండి అసోసియేషన్ లకు అతీతంగా సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఐక్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యమత్యం లేకనే ప్రభుత్వం ద్వారా రావాల్సిన హక్కులను సాధించుకోలేక పోతున్నామని దీన్ని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులు అందరూ  సమస్యల పరిష్కారానికై ఐక్యమత్యంతో పోరాడేందుకు మన హక్కులు సాధించుకునేందుకు జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే నిర్వహించబోయే రాష్ట్ర సదస్సును జర్నలిస్టులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

టెట్ విషాదం: పరీక్ష హాల్ లో గర్భవతి మృతి

Satyam NEWS

చలో రాజ్ భవన్ కు కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS

టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment