32.2 C
Hyderabad
April 20, 2024 19: 59 PM
Slider మెదక్

భవన నిర్మాణ కార్మికులకు పరిహారం ఇవ్వాలి

#Construction workers

భవన నిర్మాణ సంక్షేమ బోర్డ్ నుండి 334 కోట్ల రూపాయలు అక్రమంగా మళ్ళించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలిపారు.

ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 5000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రేవంత్ కుమార్ మాట్లాడుతూ కరోనా బారి నుండి భవన నిర్మాణ కార్మికులను కాపాడటం కోసం వెల్ఫేర్ బోర్డు నిర్ణయించిన పదిహేను వందల రూపాయలు తక్షణమే కార్మికులకు అందించాలని అన్నారు.

కరోనా మహమ్మారి నుండి భవన నిర్మాణ కార్మికుల ను రాష్ట్రాల వెల్ఫేర్ బోర్డ్ ల నుండి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని ఆయన తెలిపారు. ఢిల్లీ , హర్యానా , రాజస్థాన్ , పంజాబ్ , కేరళ , కర్ణాటక , మహారాష్ట్ర , తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వెల్ఫేర్ బోర్డు ల నుండి 5 వేల రూ. నుండి 2000 రూ. వరకు ఆర్థిక సహాయాలు అందించాయని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు లో రెండు వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నా ఇవ్వడం లేదని అన్నారు. వెల్ఫేర్ బోర్డు లో పేరు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు 1500 రూపాయలు అందించాలని వెల్ఫేర్ బోర్డు నిర్ణయించి నెలరోజులైనా నేటికీ పైసా కూడా కార్మికుల అకౌంట్లో జమ చెయ్యకపోవడం అన్యాయమని ఆయన అన్నారు.

 1996 కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని, కేంద్ర చట్టం నిబంధనలను, వెల్ఫేర్  బోర్డు రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నుండి 334 కోట్ల రూ. దారి మళ్ళించి నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొట్టిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, నాగరాజు, ముత్యంరెడ్డి, సత్యనారాయణ, జానకి చెంద్రం, రమేష్, మహ్మద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తుత్తి పెట్టుబడులే తప్ప ఒరిగేది ఏమీ లేదు

Satyam NEWS

అత్యాచారం చేసిన ఎంఐఎం నేతను అరెస్టు చేయాలి

Satyam NEWS

అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్ల అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment