36.2 C
Hyderabad
April 25, 2024 21: 50 PM
Slider మహబూబ్ నగర్

నిలువు దోపిడి చేస్తున్న స్మార్ట్ పాయింట్స్

#smartpoint

వినియోగదారుల్ని నిలువుదోపిడి చేస్తున్న అడిగే నాధుడే కరువయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో స్మార్ట్ పాయింట్ లో వినియోగదారుడిని నిలువు దోపిడీ చేస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న ఎన్ని ఫిర్యాదులు చేసిన అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. విక్రయించడానికి ధరల పట్టికలో ఒక ధర నిర్ణయించి వినియోగదారులు చెల్లింపుల సమయంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని గతంలోనే పలు ఆరోపణలు వచ్చినా నేటికీ ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

గతంలో తూకాల లో కూడా అవకతవకలు చేస్తున్నారని గతంలోనే కొందరు పట్టణ వాసులు అధికారుల దృష్టికి తీసుకుపోయినట్టు, మోసాలపై నేటికీ కట్టడి చేయకపోవడంతో స్మార్ట్ పాయింట్స్ వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా రెచ్చిపోతున్నారని వినియోగదారులు లబోధిబోమంటున్నారు. గురువారం ఒక వినియోగదారుడు బ్రెడ్ ప్యాకెట్ కొనగా ఎమ్మార్పీ కంటే ఐదు శాతంను అధిక డబ్బులు వసూలు చేయగా ఇదేమిటని ప్రశ్నించిన వినియోగదారుని పై దురుసుగా ప్రవర్తించడమే కాక దాడికి తెగబడినట్లు సమాచారం. ఇప్పటికైనా తూనికల కొలత అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, తహసిల్దార్ కలిగించుకొని వినియోగదారుల్ని మోసం చేస్తున్న మోసపూరితమైన స్మార్ట్ పాయింట్ల నుండి  రక్షణ కల్పించాలని  నగరవాసులు కోరుతున్నారు.

Related posts

రాహుల్ యాత్ర విజయవంతం కావాలంటూ పూజలు

Murali Krishna

అంబేద్కర్ విగ్రహానికి పవన్ కళ్యాణ్ విగ్రహానికి పాలాభిషేకం….

Bhavani

నీలాచలం కొండకు భారీ ర్యాలీ కోసం బీజేపీ ప్రణాళిక

Satyam NEWS

Leave a Comment