30.7 C
Hyderabad
April 19, 2024 07: 55 AM
Slider వరంగల్

ములుగులో వినియోగదారుల అవగాహనాకార్యక్రమం

#cunsumers

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వినియోగదారుల అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ బి.వెంకన్న అధ్యక్షత వహించారు. డిసెంబర్ 24 వ తేదీన నిర్వహించే జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఒక నినాదాన్ని విడుదల చేస్తుంది.

ఈ సంవత్సరం వినియోగదారుల వివాదాలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్న వినియోగదారుల కమీషన్లు అను అంశంపై జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల వినియోగదారుల మండలి అధ్యక్షులు చల్లగురుగుల మల్లయ్య ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. గతంలో వినియోగదారుల వివాదాలను వినియోగదారుల ఫోరంలు పరిష్కరించేవనీ, వీటి స్థానంలో 2019 హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో,రాష్ట్ర స్థాయిలో,జాతీయ స్థాయిలో వినియోగదారుల కమీషన్లు  వినియోగదారుల వివాదాల పరిష్కారం కోసం పనిచేస్తున్నాయని మన రాష్ట్రంలో రాష్ట్ర కమీషన్ లోనే హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్నారని,ఇతర గ్రామీణ జిల్లాల్లో అవగాహన లేని కారణంగా వినియోగదారులు నష్టాలకు గురైనప్పటికినీ ఫిర్యాదు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు.

వినియోగదారులు తమ హక్కులను తెలుసుకొని వినియోగదారుల కమీషన్ల ద్వారా తగు నష్ట పరిహారం పొంది వినియోగదారుల కమీషన్ల సేవలను వినియోగించుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. కళాశాల అధ్యాపకులు వివిధ వస్తు సేవల విషయంలో తమ అనుభవాలను జోడిస్తూ అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ ఎం.రామారావు,గణితశాస్త్ర అధ్యాపకులు జి.సృజన,జువాలజీ శాస్త్ర అధ్యాపకులు పి.రమాంజలి,భౌతిక శాస్త్ర అధ్యాపకులు వి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వన్డే కెప్టెన్సీ నియామకంపై బీసీసీఐ దృష్టి..

Sub Editor

విద్యార్థులే పాఠాలు బోధించిన వేళ

Satyam NEWS

సీబీఐటీలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

Bhavani

Leave a Comment