అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ అండ్ అవేర్‌నెస్ (ఆశ్రా) ద్వారా వినియోగదారుల్లో చైతన్యం కల్పించి వారికి చట్టాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. ఆసరా ప్రతినిధులు కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో గురువారం ఆయనను కలుసుకొని సీఎస్ ఆర్ , ఎన్‌జీఓ సమ్మిట్ 2024 పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ ఆసరా ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను, సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆశ్రా జిల్లా అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై పోరాటం, అవగాహన కల్పించడంలో భారతదేశంలోనే ఆసరా అతిపెద్ద సంస్థ అని వివరించారు. జెసీ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన లేకపోవడం వలన వినియోగదారులు నిరంతరం మోసపోతున్నారని ఎవరి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. కావున వినియోగదారుల హక్కులు, చట్టాలపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు తదితర వాటిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, త్వరలోనే ఈ అవగాహన కార్యక్రమాలకు అనుమతి కూడా ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా ఎన్‌జీఓ సమ్మిట్ 2024 పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రా జిల్లా ఉపాధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్, సీనియర అడ్వొకేట్ జర్నలిస్ట్ ఆకుల కృష్ణ పాల్గొన్నారు.