భద్రాచలంలోని గోదావరి వరదలు అంతకంతకు పెరుగుతున్నందున వరద ముంపునకు గురి అయ్యే ప్రాంతాలలోనీ సమస్యలు తెలియజేయడానికి ఐటీడీఏ కార్యాలయంలో భారీ వర్షాలు, వరదలు 2024 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన గ్రామాలలోని వరద ముంపునకు గురి అయ్యే ప్రజలు ఐటిడిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని అలాగే గ్రామాలలోని ఎవరైనా ప్రజలు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం 7995268352, సబ్ కలెక్టర్ కార్యాలయం 08743-232444, మరియు 7981219425 వరదల కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.
previous post