Slider సినిమా

బిగ్‌బాస్‌ ను ఖాతరు చేయని ఇంటిసభ్యులు

big boss

బిగ్‌బాస్‌ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. ఇంటి సభ్యుల ఎంపిక లో తప్పు జరిగిందో లేక బిగ్‌బాస్‌ తో తమకు ఓనగూరే ప్రయోజనం ఏమి లేదని అనుకుంటున్నారేమో తెలియదు కానీ బిగ్‌బాస్‌ కు కించింత్‌ మర్యాద ఇవ్వడం లేదు. చెప్పిన పనులు విజయవంతంగా పూర్తి చేయకపోగా ఇచ్చిన శిక్షలను కూడా ఖాతరు చేయడం లేదు ఇంటి సభ్యులు. పైపెచ్చు తమ నిరసనను బిగ్‌బాస్‌కు నేరుగా తెలియజేస్తున్నారు. తమను ఇంటి నుండి పంపించిన సరే కాని తెలివి తక్కువ టాస్క్‌లు చేయమని, తమ విలువను తగ్గించుకోమని వారు బిగ్‌బాస్‌ కే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

షూ తుడవకుంటే వచ్చే వారం నేరుగా నామినేష్‌లోకి వస్తావని బిగ్‌బాస్‌ హెచ్చరించగా  ఏమన్న చేసుకో పో అని చెబుతూ తాము అడిషన్‌ కు వచ్చి బిగ్‌బాస్‌ కు ఎంపిక కాలేదని బిగ్‌బాస్‌ తమ ఫాలోయింగ్‌ చూసి తమను కోరితేనే బిగ్‌బాస్‌కు వచ్చామని బట్టలు డ్రాయర్‌లు, బూట్లు తుడవడానికి రాలేదని తెలియజేశారు. దీనితో బిగ్‌బాస్‌ షో ప్రేక్షకులను రంజింప చేయలేకపోయింది ఈ వారం. ఇంట్లో దెయ్యం నాకేంటి భయం’ టాస్క్‌ రెండో రోజున తన ఫైర్‌ కొనసాగించింది పునర్నవి. నిన్నటి ఎపిసోడ్‌లో తనను ఈడ్చుకెళ్లి స్విమ్మింగ్‌ ఫూల్‌లో పడేయడాన్ని తప్పుపడుతూ.. ఇలాంటి బుల్‌ షిట్‌ గేమ్‌లు ఇవ్వొద్దు అంటూ బిగ్‌ బాస్‌కే వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి రెండో రోజు చెలరేగింది.

కాలితో అడ్డొచ్చిన వాటిని తన్నుతూ.. ఆవేశ పడింది. టాస్క్‌లు ఇచ్చేటప్పుడు సరిగా ఇవ్వండి. వాళ్లకు ఒకలా మాకు ఒకలా చెప్పే పిచ్చి టాస్క్‌లు ఇవ్వొద్దు. ఎప్పుడు బిగ్‌ బాసే రైట్‌ అనుకోవద్దు. నువ్‌ ఎప్పుడూ రైట్‌ కాదు. బిగ్‌ బాస్‌ చెప్తున్నా విను ఇలాంటి ముష్టి టాస్క్‌లు ఇచ్చి మేం నూరు శాతం ఎఫర్ట్‌ పెడితే మీకు ఇష్టం వచ్చినట్టు రద్దు చేస్తారు. అలాంటప్పుడు మాకు కూడా కాలుతుంది. ఎమోషనల్‌ డ్రైన్‌ చేయడం కరెక్ట్‌ కాదు. కొంచెం సెన్స్‌ ఉన్న టాస్క్‌లు ఇవ్వండి. నా రియాక్షన్‌ తప్పైతే బయటకు పోతా. టాస్క్‌ అన్నప్పుడు క్లియర్‌గా ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వాలి.. సిల్లీ గేమ్స్‌ ఇవ్వకు’ అంటూ బిగ్‌ బాస్‌ గాలి తీసేసింది పునర్నవి.

ఇక ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్‌ ముగిసిందని ప్రకటించారు బిగ్‌ బాస్‌. దెయ్యాల చేతిలో తొలిరోజు వరుణ్‌, పునర్నవి, శ్రీముఖిలు ప్రాణాలను కోల్పోగా రెండో రోజు రవి, మహేష్‌లు ప్రాణాలను పొగొట్టుకుని దెయ్యాలుగా మారారు. మహేష్‌తో 5 షర్ట్‌లు మార్పించాలని రాహుల్‌కి సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వగా.. అతనితో షర్ట్‌లు మార్పించేందుకు కష్ట పడ్డాడు రాహుల్‌. చిన్న చెడ్డీతో ఉన్న మహేష్‌ విట్టాతో షర్ట్‌లు మార్పించేందుకు అతనితో హౌస్‌లో ఎ సర్టిఫికేట్‌ సినిమా చేయించారు బిగ్‌ బాస్‌. అతని ఒంటిపై బట్టల్ని ఊడపీకిస్తూ పునర్నవి చెప్పినట్టుగానే చెత్త గేమ్‌ ఆడించారు.

ఇదే ఆటో.. ఇదేం గేమ్‌లో తెలియదు కాని టాస్క్‌ మాత్రం సిల్లీగానే అనిపించింది. నాకు ఉన్నవి నాలుగు షర్ట్‌లు వాటిని కూడా చింపిస్తున్నాడు బిగ్‌ బాస్‌ అంటూ షర్ట్‌లు చిరగకుండా విప్పేయడానికి ఇష్టపడిని మహేష్‌ని.. రాహుల్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రకటించారు బిగ్‌ బాస్‌. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్‌, హిమజలు మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చారని.. కాని శ్రీముఖి, పునర్నవి, మహేష్‌ విట్టాలు ఈ టాస్క్‌ని తేలికగా తీసుకున్నారన్నారు. అంతే కాకుండా టాస్క్‌ రహస్యాలను బయటకు చెప్పి నిబంధనల్ని అతిక్రమించారని అందుకు ఈ ముగ్గుర్నీ చెత్త పెర్ఫామర్స్‌గా ప్రకటించారు బిగ్‌ బాస్‌. దీనికి శిక్షగా.. శ్రీముఖి, పునర్నవి, మహేష్‌లకు లగ్జరీ బడ్జెట్‌ ఈ ముగ్గురికి లభించదన్నారు. అంతే కాకుండా ఈ ముగ్గురికీ మరో ఎక్‌ ట్రా టాస్క్‌ ఇచ్చారు.

ఎలాంటి పని ఇచ్చినా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలంటూ షూ పాలిష్‌ చేయాలని ఒక్కొక్కరికీ వందకి పైగా షూలను ఇచ్చారు. వీటితో పాటు మిగతా ఇంటి సభ్యుల షూలను క్లీన్‌ చేయాలని శిక్ష విధించారు. కాగా తనకు వేసిన శిక్షను క్షముఖి చేయడానికి సిద్దపడగా మహేశ్‌,పునర్నవిలు తాము బట్టలు డ్రాయర్‌లు,బూట్లు తుడవడానికి రాలేదని తాము బాగ్‌బాస్‌ చెప్పినట్లు చేయమని బేఖాతరుగా చెప్పారు.కాగా జ్యోతి రాహుల్‌ ల ఒత్తిడితో చివరికి మహేశ్‌ శిక్షకు సిద్దపడగా పునర్నవి మాత్రం తాను ఇంటి నుండి వెళ్లిపోతానని శిక్షను తాను తీసుకోనని పిచ్చి పనులు చేయడానికి తాను ఈ బిగ్‌బాస్‌లోకి రాలేదని చెబుతుండగా ఆమెను జ్యోతి ,వరుణ్‌,రాహుల్‌,వితిక,శిల్పలు సముదాయించే ప్రయత్నం చేశారు.

ఘూ తుడవకుంటే వచ్చే వారం నేరుగా నామినేష్‌లోకి వస్తావని బిగ్‌బాస్‌ హెచ్చరించగా అందుకు పునర్నవి ఏమి చేఔఇనా తాను ఘూ పాలిష్‌ చేయనని తేగేసి చేప్పడంతో ఈ రోజు కార్యక్రమం ముగిసింది.

Related posts

ఫుల్లు జోష్ లో తెలంగాణ బిజెపి నాయకులు

Satyam NEWS

Crime review: కఠిన వైఖరితోనే నేరాలు తగ్గుముఖం

Satyam NEWS

నెలకుర్రు గొల్లపాలెం గ్రామంలో శ్రీకృష్ణ శిలావిగ్రహ ప్రతిష్టాపన

Bhavani

Leave a Comment