37.2 C
Hyderabad
March 29, 2024 19: 59 PM
Slider నల్గొండ

కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక నిరసన ప్రదర్శన

#Contract Employees

రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలలుగా లాక్ డౌన్ నిబంధన పేరుతో సగం జీతం మాత్రమే ఇచ్చిందని, ఈ కారణంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక తెలిపింది. తమకు సగం జీతం ఇవ్వడంపై ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపామని ఇప్పుడు జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి,మండల స్థాయిల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ నిరసన తెలుపుతూ వినతి పత్రాలు అందిస్తున్నామని వారన్నారు.

లాక్ డౌన్ సడలించిన కారణంగా బకాయి ఉన్న జీతాలను వెంటనే మంజూరు చేయాలని ఇకపై పూర్తి వేతనాన్ని అందచేయాలని వారు కోరారు. ఈ మేరకు వారు నేడు హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఓరుగంటి నాగేశ్వరరావు, యతిపతిరావు, కెవి సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, శివయ్య, అంజమ్మ, పవన్ కుమార్,యన్.సత్యనారాయణ, రామకృష్ణ, గోవిందు, దామోదర్, లక్ష్మీకాంత్, రాజశేఖరరెడ్డి, విజయకుమార్, శ్రీనివాస్ కుమార్, సోమశేఖర్, హుజూర్ నగర్, గరిడేపల్లి,మఠంపల్లి మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ ముక్త భారత్… ఇంత ఈజీగా అయిపోతున్నదే….

Satyam NEWS

పర్యాటక ప్రాంతంగా జాఫర్ బావి

Bhavani

ఆన్ లైన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ సేవలు

Bhavani

Leave a Comment