27.7 C
Hyderabad
April 20, 2024 01: 49 AM
Slider ముఖ్యంశాలు

కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

#roshapati

పక్క రాష్ట్రమైన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తూ సంచల నిర్ణయాన్ని చేసినందుకు ఆయనకు అభినందనీయమని సీనియర్ కార్మిక నాయకుడు శీతల రోషపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎక్స్ రోడ్ నందు బజార్ హమాలీలు సమావేశంలో పాల్గొన్న శీతల రోషపతి మాట్లాడుతూ నేడు పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా హమాలీలకు ఎగుమతి, దిగుమతి రేట్లు పెంచాలని యాజమాన్యాన్ని కోరారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కనీస వేతన జీవో అమలు చేయకపోగా,కార్మిక చట్టాల సవరణ పేరుతో ఉద్యోగ,కార్మికులను ఇబ్బంది పెడుతుందని,ఇలాంటి పరిస్థితులలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థని రద్దుచేస్తూ అందరిని రెగ్యులర్ చేయాలని,కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర వేతనం చట్టం తెచ్చి ఈ రకంగా కార్మికులను ఆదుకోవాలని రోషపతి కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీల యూనియన్ అధ్యక్షుడు మైపాల్ ప్రేమ్, సాంబయ్య,నాగేశ్వరరావు,పెంటయ్య, దుర్గారావు,సైదులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

(Free|Trial) Green Coffee Pills Weight Loss Weight Loss Artichoke Pills For Cholesterol

Bhavani

అక్రమాయుధాల డీలర్ల అరెస్టు: భారీగా ఆయుధాల స్వాధీనం

Bhavani

న్యాయవాద దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

Satyam NEWS

Leave a Comment