27.7 C
Hyderabad
April 25, 2024 09: 11 AM
Slider నిజామాబాద్

మంజీర పై వంతెన పనులకు గ్రహణం వీడేనా

bridge

స్పీకర్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి ఈ వంతెన పనులు. కామారెడ్డి జిల్లా  మద్నూర్ మండలంలోని కుర్లా౦ గ్రామం నుండి బీర్కూర్ మండల కేంద్రానికి మంజీర నదిపై పది సంవత్సరాల క్రితం వారధి పనులు  ప్రారంభించారు.

2009 లో ఈ వారధి నిర్మాణం కొరకు అధికారుల సర్వే ఆధారంగా 344మీటర్ల పొడవుతో 11.5మీటర్ల వెడల్పుతో ఈ వంతెన నిర్మించాల్సి ఉండగా గతంలో 29కోట్లు నిధులు మంజూరు చేసి ఈ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పదేళ్ల నుండి కొనసాగుతున్న పనులు నేటికీ పూర్తి కాకపోవడం విశేషం.

సంవత్సరానికి పెరిగిన ధరలను చూపిస్తూ కాంట్రాక్టర్లు నిధులను కూడా భారీగానే పెంచుకుంటూ కాంట్రాక్టులు కూడా మారుతూ వచ్చారు. 2019నాటికి వంతెన దయం డెబ్బై కోట్లకు పెరిగింది. కానీ పనులు పూర్తి కాలేదు. ఈ వంతెన పనుల పరిశీలనలో భాగంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు అనేక పర్యాయాలు ఈ వారధి పనులను పరిశీలించి కాంట్రాక్టర్ల అధికారుల తీరుపై  అసంతృప్తి వ్యక్తం చేశారు.

కానీ వీరి తీరులో మార్పు లేకపోవడం విశేషం. 4ఏళ్లలో ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది కానీ పదేళ్లు దాటుతున్నది .కాంట్రాక్టర్ల అధికారుల నిరక్ష్యం జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారుతున్నది .నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో అనేక అవసరాలున్నాయి అందులో ప్రధానంగా వైద్యం .తరువాత విద్యా. 

ఈ వారధి  నిర్మాణం కనుక త్వరగతిన పూర్తయితే నిజామాబాద్, బాన్స్‌వాడ, బోధన్ పట్టణాలకు వెళ్లేందుకు నియోజకవర్గ ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది .దీనిపై ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్లు స్పందించి పనులను పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు .

Related posts

బెంగాల్ SSC స్కామ్ కేసులో ప్రముఖ సినీ నటి

Satyam NEWS

పరవాడ ప్రమాద బాధితులకు పరిహారం

Satyam NEWS

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

Bhavani

Leave a Comment