39.2 C
Hyderabad
April 25, 2024 16: 18 PM
Slider ప్రత్యేకం

పనులు చేయకుండానే.. రూ.100 కోట్ల బిల్లులు డ్రా చేశారు.

#bandi sudhakar

వరంగల్ ఇరిగేషన్ శాఖలో భారీగా అవినీతి, అక్రమాల దందాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇరిగేషన్ శాఖలో రూ.100 కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

వరంగల్ జిల్లాలోని ఎస్.ఆర్.ఎస్.పి., డీబీఎం 48 సి.సి. హెచ్. డివిజన్ నెం. 4 పరిధిలోని తీగరాజుపల్లి, పర్వతగిరి, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం జిల్లాలోని తీర్థాల వరకు అభివృద్ధి పనుల కోసం రూ.123 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టేందుకు నిధులు మంజురు చేయడం జరిగింది. ఈ నిధులతో డీబీఎం 48, 1ఆర్ 2ఎల్, 3ఎఆర్, 6ఎల్, 10ఆర్, 1,13 ఆర్, 16 ఆర్, 17 ఎల్, 21ఆర్, 24 ఆర్, 25 ఎల్, 26 ఎల్, 27 ఎల్, 28 ఆర్, 29 ఎల్, 30 ఆర్, 31 ఎల్, 32 ఎల్, 34 ఆర్, 35 ఎల్, 26 ఆర్, 38 ఆర్ ఉప కాల్వల అభివృద్ధి, ఎర్త్ వర్క్ బ్యాంకింగ్, సిసి లైనింగ్, ఇన్స్ పెక్షన్ పాత్ పనులు చేపట్టాల్సి ఉంది.

అయితే, ఈ పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై దాదాపు రూ.17 కోట్ల పనులు జరిగినట్లుగా బిల్లులు రికార్డు చేసుకొని, డబ్బులు డ్రా చేసుకున్నారని బండి సుధాకర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా తనిఖీలు చేయకుండానే కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజీలు తీసుకొని క్వాలిటీ సర్టిఫికెట్ జారీ చేయడం దారుణమన్నారు.

దాదాపు 20 కోట్ల రూపాయలతో పర్వతగిరి పెద్ద చెరువు పనులు కూడా నాణ్యత లేకుండా చేశారని, దీనిపై అక్కడ పనిచేసిన ఏఈ విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా విచారణ జరిపారన్నారు. విచారణాధికారి అయిన విజిలెన్స్ డీఈ శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్ల వద్ద రూ. 50 లక్షలు లంచం తీసుకొని, వారికే వత్తాసు పలకడం శోచనీయమన్నారు.

నాణ్యత లేకుండా పనులు చేసిన కాంట్రాక్టర్లు

వరంగల్ జిల్లాలోని డీబీఎం 38 ప్యాకేజీ పనులు గీసుకొండ, మల్లంపల్లి, పరకాల వరకు రూ.123 కోట్ల అంచనా వ్యయంతో డోవెల్ బ్యాంకింగ్ సిసి లైనింగ్, ఇన్స్ పెక్షన్ పాత్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేశారన్నారు.

డీబీఎం 48, డీబీఎం 38లలోని పనులను కాంట్రాక్టర్లు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, స్వర్ణ ఎలక్ట్రికల్స్ అండ్ కాంట్రాక్టర్స్ అధినేత సురేశ్ రావు, సుమన్ రావు దక్కించుకున్నారని బండి సుధాకర్ గౌడ్ తెలిపారు. వీరు నాణ్యత లేకుండానే కొన్ని పనులు చేశారని, మరికొన్ని పనులు చేయకుండానే బిల్లులు రికార్డు చేసుకొని ప్రజా ధనాన్ని అప్పనంగా కొట్టేశారని ఆయన ఆరోపించారు. ఇందులో మొత్తం రూ.240 కోట్ల రూపాయల పనుల్లో దాదాపు రూ.100 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు, అధికారులు, అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై, ప్రజాధనాన్ని కాజేశారని బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు.

వీరి అవినీతిని ప్రశ్నించిన ఒక ఏఈని తమ రాజకీయ పలుకుబడితో ఖమ్మంకు ట్రాన్స్ ఫర్ చేయించారని, అంతేగాకుండా ప్రస్తుత ఈఈ వెంకటేశ్వర్లును కాపాడేందుకు ఒక ఏడాదికాలంలో నలుగురైదుగురు ఈఈలను ట్రాన్స్ ఫర్ చేయించారంటే వాళ్లు ఎంత పకడ్బందీగా అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుందని ఆయన అన్నారు.

వరంగల్ ఇరిగేషన్ శాఖలో జరిగిన దాదాపు రూ.100 కోట్ల అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ విచారణాధికారిగా వచ్చి అక్రమాలకు పాల్పడిన డీఈ శ్రీనివాసును సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. అలాగే, పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్ల నుంచి రెవెన్యూ రికవరీ యాక్టు కింద రూ.100 కోట్లు వసూలు చేసి, వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.

Related posts

పెరుగుతున్న అసంతృప్తి: నెల్లూరు నుంచి మరో ఎమ్మెల్యే తిరుగుబాటు?

Satyam NEWS

Corona Alert: సెంచరీకి దగ్గరలో కరోనా కేసులు

Satyam NEWS

రిజెక్ట్: ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఒప్పుకోం

Satyam NEWS

Leave a Comment