33.2 C
Hyderabad
April 26, 2024 02: 57 AM
Slider వరంగల్

మేడారం జాతర పనులపైన నిర్లక్ష్యం వద్దు

seetakka 18

కాంగ్రెస్ పార్టీ మహిళా జాతీయ  ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు మేడారం జాతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2020 లో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కేవలం 50 రోజులు మాత్రమే ఉన్నందున పనులు వేగవంతంగా చేయాలని అన్నారు.

ఇంకా పునాదుల దగ్గరే పనులు ఉన్న పరిస్థితులు మారాలని ఆమె అన్నారు. మేడారం భూ నిర్వసితులకు గత ప్రభుత్వాలు పని కల్పిస్తే ఈ ప్రభుత్వం వారిని ఉపయోగించుకోవడం లేదని అన్నారు. ఇక్కడ  జీవించే ప్రజలు పరాయివాళ్ళు కాదని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సుమారుగా కోటి మంది భక్తులకు ఇలాంటివి వెయ్యి షెడ్స్ నిర్మించినా సరిపోవని చెట్ల మధ్య గుట్టల మధ్య ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తే బాగుండేదని అన్నారు. మేడారం జాతర చుట్టూ పక్కల పది గ్రామాలకు సీసీ రోడ్లు డ్రైనేజి లు ఏర్పాటు చేస్తే ఆ గ్రామాల గుండా పోయే భక్తులకు వచ్చే భక్తులకు అదే విధంగా జాతర సందర్బంగా కొంచం అభివృద్ధి జరిగి ఉండేదని ఆమె అన్నారు.

ఈ మహా జాతరకు భక్తులకు త్రాగు నీరు కోసం వాటర్ ట్యాoకు నిర్మించాలని గత రెండు మూడు నెలలుగా చెపుతున్నా వినకుండా ఇప్పుడు ప్రారంభించారని ఆమె అన్నారు. జంపన్న వాగు లో నిర్మించిన 4వ కాజువే ఊరట్టం వద్ద ఉన్న చెక్ డ్యామ్ కొట్టుకు పోయిందని చిన్నబోయిన పల్లి నుండి ఊరట్టం మీదిగా వచ్చే భక్తులకు ఇబ్బంది కలకుండా చూడాలని ఎన్ని సమీక్షా సమావేశాలలో చెప్పినా పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.

చెక్ డ్యామ్ ల స్థానంలో ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి కాంటాక్టర్లు లక్ష ల రూపాయలు దండుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్ పాల్గొన్నారు.

ఇంకా మండల అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, ఎల్లారెడ్డి, ఎండీ చాంద్ పాషా, చిటమట రఘు, చెన్నోజు సూర్యనారాయణ, బానోత్ రవిచంద్ర, అర్రేమ్ లచ్చు పటేల్, పాక సాంబయ్య, ఇర్సవడ్ల వెంకన్న, సర్పంచ్ ఈసం రాంమూర్తి, ఎండీ జలీల్ ఖాన్, గుడ్ల దేవేందర్, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, చేర్ప రవీందర్, ముషినపెల్లి కుమార్ గౌడ్, ఆకుతోట చంద్రమౌళి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సుధాకర్, చింత క్రాంతి కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

వైసీపీ ప్రభుత్వ వన్ టైమ్ దోపిడిని అడ్డుకుందాం

Satyam NEWS

పాలంపేట రామప్ప దేవాలయం వద్ద హెరిటేజ్ వాక్

Satyam NEWS

పోలీస్ క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌నం ప‌నుల ప‌రిశీల‌న‌

Sub Editor

Leave a Comment