29.2 C
Hyderabad
October 13, 2024 16: 04 PM
Slider ముఖ్యంశాలు

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

delhi cm

కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు.

కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా సీఎం వివరించారు.

రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆవశ్యతను వివరిస్తూ మూసీ మురికి నీటి శుద్ధి పనులకు రూ. 4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నింపే పనుల కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించాలని కోరారు.

జంట నగరాలకు సంబంధించి ఈ రెండు జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019 లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంతవరకు నిధులు ఇవ్వలేదని గుర్తుచేస్తూ ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు.

తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని ఇందుకోసం పీఎంఏవై (అర్బన్ మరియు రూరల్) కింద చేపట్టే నల్లా కనెక్షన్ల కోసం రూ. 16.100 కోట్ల వ్యయం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు.

Related posts

కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర ఆరోపణలు

Satyam NEWS

Best Does Medication To Lower Blood Pressure Help Side Effects Of All Antihypertensive Drugs

Bhavani

మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి మౌనం విడాలి

Bhavani

Leave a Comment