30.7 C
Hyderabad
April 19, 2024 07: 22 AM
Slider ఖమ్మం

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ

#addl dgp

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణలో వుంటాయని అడిషనల్ డీజీపీ వై.నాగిరెడ్డి అన్నారు. వైరా పోలీస్​ స్టేషన్ ను ఖమ్మం  పోలీస్ కమిషనర్ తో కలసి సందర్శించి  పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్​ నిర్వహణ, పోలీసుల పనితీరు,  స్టేషన్​ రికార్డులను తనిఖీ చేశారు. కేసుల వివరాలు, శాంతి భద్రతల ఆంశలపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుత వైరా డివిజన్ పరిధిలో నేరాలు అదుపులో వున్నాయని అన్నారు. అదేవిధంగా గతంలో కంటే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించడంలో ప్రజలు పూర్తి సహకారం అందిచారని తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది చక్కని పనితీరుతో నేరాల సంఖ్య క్రమంగా తగ్గించారని అన్నారు. భవిష్యత్తులో కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని భద్రత పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను  సంబంధిత శాఖలతో సంప్రదించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా విధినిర్వహణలో రాణించడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలందించించిన బ్లూకోల్డ్స్ కానిస్టేబుల్ బూక్య బాల్య ను అభినందిస్తూ సర్టిఫికేట్ అందజేశారు.  ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ అవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైరా ఏసిపీ రహెమాన్, సిఐ సురేష్ కుమార్, మధిర సిఐ మురళీ, ఎస్సైలు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం

Satyam NEWS

లక్కీ పోలీస్ :హత్య కేసు విచారిస్తుంటే ఐఎస్‌ఐ ఏజెంటు దొరికాడు

Satyam NEWS

ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment