37.2 C
Hyderabad
March 29, 2024 18: 14 PM
Slider ప్రపంచం

ఈ సారి హజ్ యాత్రపై కఠిన ఆంక్షలు

#Haj pilgrims

హజ్ యాత్ర పై సౌదీ అరేబియా కఠినమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.  వయసు మళ్లిన వారికి ఈ సారి హజ్ యాత్రలో అవకాశం కచ్చితంగా ఉండదు. చనిపోయే లోపు ఒక్క సారి హజ్ యాత్ర చేయాలని ముస్లింలకు కోరిక ఉంటుంది.

ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి ప్రతి ఏటా సుమారు రెండున్నర కోట్ల మంది మక్కా మదీనా వెళతారు. దీని ద్వారా సౌదీ అరేబియా రాజుకు 12 బిలియన్ డాలర్ల మేరకు అంటే 9 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయితే ఈ సారి పెరుగుతున్న కరోనా వైరస్ కారణంగా హజ్ యాత్రను నామమాత్రంగానే నిర్వహించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది.

వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఈ హజ్ యాత్ర కు సంబంధించిన ప్లాన్ వేసుకోవద్దని సౌదీ అరేబియా ముస్లింలను కోరింది. హజ్ యాత్రకు వచ్చే వారందరికి ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉన్నందున ఎంత మందికి ఆరోగ్య పరీక్షలు చేయగలమో అంచనా వేసుకుని అంత మందిని మాత్రమే మక్కా మదీనాకు వచ్చేందుకు అనుమతించాలని అనుకుంటున్నారు. 

హజ్ యాత్రకు కోటా ఇచ్చే దేశాలలో కేవలం 20 శాతం మాత్రమే ఖరారు చేయాలని కూడా యోచిస్తున్నారు. అయితే ఇన్ని దేశాల నుంచి అంత మందినైనా వచ్చేలా చేయడం, వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని అయినందున ఈ సారి హజ్ యాత్రను రద్దు చేయాలని కూడా మరి కొందరు సిఫార్సు చేస్తున్నారు. అనుమతి ఇచ్చిన అంతర్జాతీయ విమానాలను కూడా మళ్లీ కోవిడ్ కేసులు పెరిగే సరికి జెడ్దాలో తాజాగా ఇతర దేశాల విమానాలను మళ్లీ నిషేధించారు.

ఇంత అనిశ్చిత స్థితిలో హజ్ యాత్రకు అనుమతులు ఇవ్వడం ఎలా అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Related posts

తొలిసారిగా విజయనగరం కు రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి

Satyam NEWS

పోలీస్ రైడ్:ఆన్‌లైన్‌ వ్యభిచార కేంద్రంపై పోలీసుల దాడి

Satyam NEWS

బిచ్కుందలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

Satyam NEWS

Leave a Comment