30.7 C
Hyderabad
April 19, 2024 08: 02 AM
Slider ఆదిలాబాద్

పరిపాలనలో పారదర్శకత పెంచేందుకే కంట్రోల్ రూమ్

controle room

ఉద్యోగులు తమ విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించడాని కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర అటవీ పర్యావరణం న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ లతో కలిసి కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్ పనితీరుపై పరిశీలించారు.

వీడియో కాలింగ్ ద్వారా లక్ష్మణ్చందా ఎంపీడీవో మోహన్ తో మాట్లాడి విధులలో భాగంగా అతను ఏ గ్రామంలో ఉన్నది అడిగి తెలుసుకున్నారు.  పట్టణ ప్రగతి లో భాగంగా చింతకుంట వాడ ప్రత్యేక అధికారి ఎక్కడున్నది తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో జవాబుదారితనం పెంచేందుకు, సక్రమంగా విధులు నిర్వహించేందుకు కంట్రోల్ రూమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

నిర్మల్ కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ మంత్రి అభినందించారు. ఇలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. మంత్రి అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు.

నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులు పని చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ లో గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో 4 కంట్రోల్ టీవీ లను ఏర్పాటు చేశామన్నారు.

ట్రాక్టర్లు రూట్ మ్యాప్ ప్రకారం చెత్తను సేకరిస్తున్నాయా లేదా అవి ఎక్కడికి వెళుతున్నాయి గమనించవచ్చునని అన్నారు., ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సకాలంలో విధులకు హాజరవుతున్నరా  లేదా, క్షేత్ర స్థాయిలో అధికారులు ఎక్కడ పని చేస్తున్నది వీడియో కాల్ ద్వారా వీక్షించవచ్చునని అన్నారు.

ఎంపీడీవోల, ఎంపీడీఓల, ఐ సి డి ఎస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల లైవ్ లొకేషన్ కోసం ఏర్పాటు చేసి పరిశీలించడం జరుగుతుంది అన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాల్టీలు నిర్మల్ భైంసా ఖానాపూర్ పట్టణాలలో  పది రోజులుగా పట్టణ ప్రగతి అమలు చేస్తున్న తీరును పరిశీలించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపెళ్లి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్ జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ నదీమ్ ఖాన్, రామ్ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపి అవినీతి నిరోధక శాఖ డీజీ ఆకస్మిక బదిలీ

Satyam NEWS

బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ

Bhavani

రాజధాని గ్రామాల మహిళలపై పోలీసు దాడి అమానుషం

Satyam NEWS

Leave a Comment