39.2 C
Hyderabad
March 29, 2024 15: 20 PM
Slider ప్రత్యేకం

బాల్య వివాహాలను నియంత్రించడం అందరి బాధ్యత…!

#vijayanagarampolice

వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలలపై జరిగే లైంగిక దాడుల నియంత్రణ, మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార రధాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక‌ జిల్లా పోలీసు కార్యాలయం వద్ద  ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ  బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం ఉందన్నారు. ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసే బాధ్యత అందరిది అని అన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఇందుకోసం, గ్రామీణ ప్రాంత ప్రజల్లో బాల్య వివాహాల అనర్థాలను  వివరించి, వారిలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాలు చేయడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనడంతోపాటు, మానసికంగా వివాహానికి పరిపక్వతలేని పరిస్థితుల్లో ఉంటూ, ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.

బాల్య వివాహాల వలన బాలలు ఆనందంగా, ఆహ్లాదంగా జీవించలేక, ఉన్నత స్థితికి చేరుకొనే అవకాశాలను కోల్పోతున్నారన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు జిల్లా పోలీసుశాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ తరహా నేరాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ ముందుకు రావడం అభినందనీయమని వరల్డ్ విజన్ ప్రతినిధులను, భాగస్వామ్యులైన చైల్డ్ లైను, యూత్ సర్వీస్, వన్ స్టాప్, ఇతర ప్రతినిధులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించారు.

అంత‌కు ముందు  వరల్డ్ విజన్ ప్రోగ్రాం మేనేజరు టి.మెషేక్ మాట్లాతూ బాల్య వివాహాల నియంత్రణకు ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చేందుకు వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో ప్రచార రధాన్ని ఏర్పాటు చేసామన్నారు. దేశ వ్యాప్తంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు అందరూ సమష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సంద‌ర్భంగా బాల్య వివాహాల నియంత్రణకు అందరూ సమష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, సీఐలు జి.రాంబాబు, బి.వెంకటరావు, దిశ ఎస్ఐలు ప్రకాష్, గణేష్,,ఏఎస్ఐ ర‌జ‌నీ , యూత్ సర్వీస్ డైరెక్టరు విజయ కుమార్, లక్ష్మన్, బెంజిమెన్, యోహాను,టి.ప్రదీప్, జె.ఓఓ. చైల్డ్ లైను, వన్ స్టాప్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

అంతర్ రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్ల‌పై పీడీ యాక్ట్‌

Sub Editor

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, తెప్పోత్సవం కు హాజరుకండి

Murali Krishna

వైభవంగా తీజ్ పండుగ వేడుకలు

Satyam NEWS

Leave a Comment