28.7 C
Hyderabad
April 25, 2024 03: 28 AM
Slider జాతీయం

సుప్రియ పై వివాదాస్పద వ్యాఖ్యలు: భగ్గుమన్న మహారాష్ట్ర

ఎన్సీపీ నాయకురాలు ఎంపీ సుప్రియా సూలేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి అబ్దుల్ సత్తార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ‘ఖోక్స్’ (డబ్బుల పెట్టెలు) గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన సుప్రియా సూలే పై దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఒక్క సారిగా మహారాష్ట్ర ప్రజలు భగ్గుమన్నారు. ఎంపీ సూలే మద్దతుదారులు, ఎన్సీపీ కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అబ్దుల్ సత్తార్ నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో సుప్రియా సూలే మద్దతుదారులు, NCP కార్యకర్తలు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న వారు మంత్రి అబ్దుల్ సత్తార్ ఇంటిని ధ్వంసం చేసి, నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు. విమర్శలు ఎదుర్కొంటున్న సత్తార్ కూడా ఈ విషయంలో విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని అన్నారు. అయితే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మార్తె సూలేపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. సత్తార్ రాజీనామా చేయాలని, లేకుంటే రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేరని ఎన్సీపీ నేత విద్యా చవాన్ హెచ్చరించారు. మరో ఎన్‌సిపి నేత ఏక్‌నాథ్ ఖడ్సే కూడా సత్తార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, వ్యవసాయ మంత్రికి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కొన్ని మర్యాదలు నేర్పాలని అన్నారు. ఔరంగాబాద్ జిల్లాలోని సిలోడ్ నియోజకవర్గానికి సత్తార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Related posts

రూ. 50 కోట్ల కి ఐపీ పెట్టిన లాటరీ శేఖర్ కోసం గాలింపు ముమ్మరం

Satyam NEWS

ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరు

Satyam NEWS

5 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment