38.2 C
Hyderabad
April 25, 2024 13: 19 PM
Slider ప్రత్యేకం

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే గూడెం

#Patancheru MLA 2

ఒక్కోమెట్టు ఎక్కుతూ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గతమంతా వివాదాలమయమే. మహిపాల్ రెడ్డి తాను రాజకీయ నేతగా ఎదిగేందుకు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశారు అంటారు తనను మొదటి నుండి ఎరిగినవారు. అందుకే ఓ ఓ సాధారణ రాజకీయ నాయకుని  నుండి మొదలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిలవడం ఆయనకే చెల్లింది.

కానీ తన రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా వివాదాలే కనిపిస్తాయి. పఠాన్ చెరు ప్రాంతం ఇండస్ట్రీయల్ ఏరియా కావడంతో ఇక్కడ కొందరు రాజకీయ నాయకులు కంపెనీల్లో ఏ చిన్న గొడవ జరిగినా, ప్రమాదాలు చోటు చేసుకున్న అన్నీ తామై సెటిల్ మెంట్లు చేయడం వారికి పరిపాటిగా మారిందని, తమను బెదిరించి, భయపెట్టి సెటిల్ మెంట్ల పేరుతో తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని పలు సందర్భాల్లో కంపెనీల యజమానులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు.

పరిశ్రమలపై వత్తిడి తెచ్చిన ఎమ్మెల్యే

ఇదే తరహాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 2014, మే 5న పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని పాశమైలారంలోని  వర్సటైల్ పరిశ్రమలో పనిచేస్తున్న మహేశ్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో మహిపాల్‌రెడ్డి, 70 మంది అనుచరులతో కలసి పరిశ్రమ వద్దకు వెళ్లి గొడవకు దిగారు.

ఆ కార్మికుడిని మీరే చంపారంటూ మహిపాల్‌రెడ్డి తమను బెదిరించారని పరిశ్రమ యజమాని పాటి చందుకుమార్ 2014, మే 7న  బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పరిశ్రమ జీఎం మదన్‌కాంత్, ఏజీఎం ప్రశాంత్ ఉన్నారని.. తన వద్ద నుంచి రూ. 15 లక్షలకు బలవంతంగా చెక్కు రాయించుకున్నారని అందులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిని దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేశారు. అయితే దీనిపై స్టే తెచ్చుకున్న మహిపాల్ రెడ్డి ఎన్నికల్లో పోటీచేసి మరోసారి గెలిచారు.

ఎన్నికల అఫిడవిట్ లో సమాచారం దాచిన వైనం

కానీ ఆయన ఎన్నికల అఫిడవిట్ లో తనకు సంగారెడ్డి న్యాయస్థానం శిక్ష విధించిన విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనకుండా నిజాలు దాచి ఎన్నికల్లో పోటీచేశారని. ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి మరోసారి కోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ కేసులో రెండున్నరేళ్లకుపైగా జైలు శిక్ష పడిన వ్యక్తులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదని హరీశ్ యాదవ్ తన పిటీషన్లో పేర్కొన్నారు.

ఇలా అనేక వివాదాలు ఆయన చుట్టూ ఉంటూనే ఉన్నాయి.  భూపంచాయితీలు, అక్రమ వెంచర్లు, సెటిల్ మెంట్లలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా గూడెం పాత్ర ఉంటుందని ఆయన వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 2019 అక్టోబర్ లో ఓ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ ను కూడా బెదిరించారని అప్పట్లో జర్నలిస్ట్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదంతా ఒక ఎత్తయితే గూడెం కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని 2016లో ఓ అజ్ఞాత వ్యక్తి ఇన్ కం ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2016 అక్టోబర్ లో ఐటీ అధికారులు ఆయన నివాసంపై దాడి చేశారు. ఇలా ఎప్పుడూ ఏదో ఓ వివాదం ఆయన చుట్టూనే ఉంటుంది.

తండ్రిని మించిన తనయుడు..

తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. మామూలుగా మంచి విషయాల్లో అలా అనిపించుకుంటే ఎవరైనా శభాష్ అని పొగుడుతారు. కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మహిపాల్ రెడ్డి బాటలోనే ఆయన కుమారుడు కూడా నడవడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది.

రోడ్డుపక్కన చిన్న బేకరీ షాప్ నడుపుతున్న వ్యక్తిపై తన జులుం చూపించారు ఎమ్మెల్యే తనయుడు. పఠాన్ చెరులోని వెంకటేశ్వర వైన్స్ ముందు చిన్న బేకరీ నడుపుతున్న కిరణ్ గౌడ్ దగ్గరకు తన అనుచరులతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

తాను ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు నాకే ఎదురుచెప్తావా అంటూ నాపై తన అనుచరులతో కలిసి దాడిచేశారంటూ కిరణ్ గౌడ్ ఈ యేడాది జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 447, 323, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలా తండ్రి, తనయుల వివాదాలు నియోజకవర్గంలో సర్వసాధారణంగా మారాయని, రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులే తమపై దాడులు చేస్తే ఎలా అని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

జిఎస్టి పేరుతో రాష్ట్రాన్ని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

Satyam NEWS

కోవిడ్ పేరుతో పగటిపూట 144 సెక్షన్ అమలు చేయవద్దు

Satyam NEWS

Leave a Comment