28.7 C
Hyderabad
April 20, 2024 06: 36 AM
Slider ముఖ్యంశాలు

అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్న రాజ్యసభ సభ్యుడు

#PilliSubhashChandraBose

మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఖరి ఆ పార్టీ ముఖ్య నాయకులకు మింగుడు పడటం లేదు. పలు వివాదాస్పద అంశాలను రెచ్చగొడుతున్న ఆయన ఏం ఆశించి ఇలా ప్రవర్తిస్తున్నారో అర్ధం కాక అధికార పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది.

పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు జరిగాయి. ఈ దాడులను అనవసరమని, తక్షణమే ఏసిబి దాడులను తమ శాఖ అధికారులపై నిలిపివేయాలని మంత్రిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ హో మంత్రికి లేఖ రాశారు.

ఈ లేఖ అప్పటిలో సంచలనం సృష్టించింది. మంత్రి గా లేఖ రాయడంతో అప్పటి లో రెవెన్యూ ఉద్యోగులపై ఏసీబీ దాడులు నిలిపివేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నిక అయ్యారు.

రాజ్యసభ సభ్యుడైన తర్వాత తన చిరకాల ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులపై 20 ఏళ్ల కిందట జరిగిన శిరోముండనం కేసులో విచారణ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేయడం అప్పటిలో సంచలనం కలిగించింది.

సౌమ్యుడుగా పేరు పడ్డ పిల్లి సుభాస్ చంద్రబోస్ తోట త్రిమూర్తులు పైన శిరోముండనం కేసును వేగవంతం చేయాలని కోరడంతో తిరిగి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా జెడ్ పి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తో టిడ్కో విషయంలో వాగ్వాదానికి దిగడం వివాదాస్పదంగా మారింది.

ప్రస్తుతం రాష్ట్రంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికార పార్టీ నేతలతో ఢీ కొంటున్న ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై అధినేత జగన్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరు ఉంది. అలాంటి వ్యక్తిపైనే ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్ధం కావడం లేదు.

Related posts

గాజుల రామారం లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఔట్లెట్

Satyam NEWS

వేడుకగా హత్యరాల శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి కళ్యాణం

Satyam NEWS

బేలా బై పాస్ రోడ్డు మంజూరికి వినతి పత్రం

Satyam NEWS

Leave a Comment