39.2 C
Hyderabad
March 29, 2024 13: 51 PM
Slider ముఖ్యంశాలు

కోర్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

#MLA Seediri Applaraju

అధికార వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కోర్టులను హెచ్చరిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టులను తప్పు పట్టారని 49 మందికి నోటీస్ లు ఇచ్చారు. కోర్టులు పరిధి దాటితే 4 కోట్ల మంది విమర్శించే పరిస్థితి వస్తుంది’’ అంటూ పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కామెంట్ చేశారు.

లెజిస్లేటివ్ నిర్ణయాల్లోకి జ్యూడిషీయల్ వ్యవస్థ చొరబాటు పై చర్చ జరుగుతున్నదని ఆయన అన్నారు. నిమ్మగడ్డ ను ఎస్.ఇ.సి గా చంద్రబాబు కేబినెట్ గవర్నర్ కి ఎలా సిఫార్సు చేసింది? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వైసీపీని ప్రజలు ఆదరించారు కానీ కోర్టు, చట్టాల లొసుగులను అడ్డంపెట్టుకొని ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని ఆయన అన్యాపదేశంగా విమర్శలు గుప్పించారు.

తాగి తందనాలు ఆడితే వెసులుబాటు ఎలా ఇస్తారు?

డాక్టర్ సుధాకర్ రోడ్ మీద తాగి తందనాలు ఆడితే వెసులుబాటు ఎలా ఇస్తారు. ఉన్నత విద్యావంతులకు ప్రత్యేక చట్టాలు ఉండవు అంటూ ఆయన సీరియస్ కామెంట్లు చేశారు. రాజకీయవ్యవస్ధపై న్యాయవ్యవస్ధ ఎప్పుడు జోక్యం చేసుకోవాలనే అంశాలను రాజ్యాంగంలోని ఆర్టికల్స్ లో పొందుపరిచారని ఆయన అన్నారు.

ఎక్కడైనా ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం కల్గుతున్నాయంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని, అలాగే రాజ్యాంగ సూత్రాలకు విరుద్దంగా పరిధిని దాటి ఏవైనా చట్టాలు రూపొందించే పరిస్ధితి ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

ఆరావళి గోల్ఫ్ క్లబ్ కేసు ఒక సారి చూడండి

ఈ చట్టాల వల్ల ప్రజల ప్రాణాలు, పర్యావరణ హక్కులకు భారీగా నష్టం వాటిల్లుతుంటే  కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. రాజకీయ వ్యవస్ధకు, న్యాయ వ్యవస్ధకు మధ్య లైన్ ఉంటుంది. కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు… 2008 లో ఆరావళి గోల్ఫ్ క్లబ్   విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.

ఇద్దరు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు మందలించింది

ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు న్యాయమూర్తులను ఆ రోజు  సుప్రీంకోర్టు మందలించింది. ఆరావళి గోల్ఫ్ క్లబ్ వర్సెస్ చంద్రహాస్ కేసు విషయంలో  సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ప్రాధమిక హక్కులను అవసరమైతే సవరించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్ కు ఇచ్చింది. ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సంక్షేమపధకాలు, సంస్కరణలు ముందుకు తీసుకువచ్చారు.

విద్యా,వైద్యరంగాలలో రీఫామ్స్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిపాలన పరంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. డీసెంట్రలైజేషన్, గ్రామసచివాలయాల వ్యవస్దను తీసుకువచ్చారు. ఎన్నికల సంస్కరణలలో భాగంగా ఎన్నికల కమీషనర్ పదవి కాలాన్ని తగ్గించడం, తటస్ధంగా ఉండే వ్యక్తులను ఆ పదవిలో నియమించాలనే ఉధ్దేశ్యంతో రిటైర్డ్ జడ్జి రాష్ర్టఎన్నికల కమీషనర్ గా ఉండాలని ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.

టీడీపీ ఎందుకు హడావుడి చేస్తున్నది?

ఇది ఎన్నికల సంస్కరణలలో భాగంగా చేసింది అని ఆయన అన్నారు. ఇంతకు ముందున్న ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొందరు టిడిపి నేతలు ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆ ఆర్డినెన్స్, ప్రభుత్వం జారీచేసిన జిఓలు చెల్లవని తీర్పు ఇవ్వడంతోపాటు రాష్ర్టప్రభుత్వానికి ఒక డైరక్షన్ ఇచ్చింది. అదేమంటే పాత ఎన్నికల కమీషనర్ ను కొనసాగించాలనేదే ఆ డైరక్షన్.

ఈ ప్రత్యేకమైన పరిస్ధితులలో టిడిపి నేతలలో ఒకటే హడావుడి మొదలైంది. ఎందుకు మీకు అంత ఆతృత.నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మీకున్న ఇంట్రస్ట్ ఏంటి.ఆయననే కొనసాగించాలని మీరు అడగడంలో మీ అర్దం ఏంటి. ఎన్నికల కమీషనర్ పదవి కాలాన్ని మూడు సంవత్సరాలకు కుదిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి.

మీకేమైనా అభ్యంతరమా. చంద్రబాబూ…రాజ్యాంగంపై మీకు నమ్మకం లేదు.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అపహస్యం చేశారు.రాజ్యాంగనిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

Related posts

మంత్రి మల్లారెడ్డి కొడుక్కి ఛాతిలో నొప్పి

Satyam NEWS

భాషా పండితులు పి.ఈ.టి లకు న్యాయం చేయాలి

Bhavani

పోస్టింగూ పోస్టింగూ గాలికి కొట్టుకుపోయావా?

Satyam NEWS

Leave a Comment