35.2 C
Hyderabad
April 20, 2024 15: 05 PM
Slider జాతీయం

Controversy: సెక్సీయస్ట్ వ్యాఖ్యలు చేసిన బిగ్ బి

#AmitabBachan

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ అందాన్ని పొగుడుతూ అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో ఒక కంటెస్టెంట్ ను అమితాబ్ బచ్చన్ ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే స్క్రీన్ పైన గీతా గోపీనాథ్ ను చూపించి ఈ అందమైన మొహం ఎవరిది అని అడిగారు.

అంతటితో ఆగకుండా ఇంత అందమైన మొహాన్ని ఆర్ధిక పరమైన అంశాలతో ముడిపెట్టి చూడటం సాధ్యమా అని కూడా అమితాబ్ బచ్చన్ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సంబంధించి గీతా గోపీనాథ్ ఆనందపడ్డారు కానీ నెట్టిజన్లు మాత్రం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెక్సుపరమైన వ్యాఖ్యలు చేయడం బిగ్ బి లాంటి పెద్ద వారికి తగదని వ్యాఖ్యానిస్తున్నారు.

నెట్టిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా గీతా గోపీనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. బిగ్ బి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సంతోషకరమని గీతా గోపీనాథ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

గీతా గోపీనాథ్ ఇలా వ్యాఖ్యానించడం బాగాలేదని నెట్టిజన్లు అంటున్నారు. ‘‘అంత పెద్ద వ్యక్తి కూడా చాలా చిన్నగా ఆలోచించి వ్యాఖ్యానించడం తగదు’’ అనే వ్యాఖ్యను గీతా గోపీనాథ్ చేసి ఉండాలని నెట్టిజన్లు అంటున్నారు.

Related posts

జాతీయ అవార్డు పొందిన సర్పంచ్ లకు సీఎం అభినందన

Satyam NEWS

సీఎం ప్రకటన సరైంది కాదు: ఐజేయూ

Bhavani

ఆనందయ్య మందు అమ్ముకోవడానికి వైసీపీ నేతల భారీ కుట్ర

Satyam NEWS

Leave a Comment