35.2 C
Hyderabad
April 20, 2024 16: 35 PM
Slider సినిమా

చిటికెడు సాయం చేయని హీరో సొంత లాభం కోసం వచ్చేశాడు

#Hero Ram

ఏదైనా సామాజిక కార్యక్రమాలు చేయడానికో, కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న పేదవారికో సాయం చేయడానికి ముందుకు రాని తెలుగు సినీ హీరోలు వాళ్ల సొంత వ్యవహారం వచ్చే సరికి వీరవిహారం చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి, తమ దగ్గరి బంధువులుకు నొప్పి కలిగితే తప్ప వారు రంగంలోకి రారన్నమాటను హీరో రామ్ నిజం చేశాడు.

యువ హీరో రామ్ పోతినేని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నట్లుగా పోజు కొట్టి తన వారిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. పది మంది మరణానికి కారణమైన విజయవాడ రమేష్ హాస్పిటల్ రమేష్ హీరో రామ్ కు బాబాయి అవుతాడు.

ఇప్పుడు ప్రభుత్వం విధించిన చక్ర బంధనంలో డాక్టర్ రమేష్ చిక్కుకుపోయి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. హీరో రామ్ తగుదునమ్మా అంటూ వచ్చి తన బాబాయికి అనుకూలంగా ట్విట్లు పెట్టాడు. ఇప్పుడు ఆ ట్విట్లపై చర్చ జరుగుతున్నది.

విజయవాడ రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో హీరో రామ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి విజయవాడ పోలీసులు ఆసక్తి చూపలేదు. హీరో రామ్ చేసిన వ్యాఖ్యలపై ఏమంటారు? అంటూ మీడియా ప్రశ్నించగా, ఆయన ఎవరో తమకు తెలియదని ఏసీపీ అన్నారు.

అయితే రామ్ చేసిన ట్వీట్ల గురించి వివరణ ఇస్తూ, కొవిడ్ కేర్ సెంటర్ కు, క్వారంటైన్ కేంద్రానికి చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని టెస్టు చేసే వరకు వారిని వివిధ హోటళ్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతామని, స్వర్ణ ప్యాలెస్ లోనూ మొదట్లో క్వారంటైన్ కేంద్రం నిర్వహించినట్టు తెలిపారు.

విదేశాల నుంచి వచ్చేవారు ఇలాంటి క్వారంటైన్ కేంద్రాల్లో బస చేసినందుకు కొంత మొత్తం చెల్లిస్తారని, కరోనా టెస్టులు పూర్తయిన తర్వాత వారు వెళ్లిపోతారని ఏసీపీ స్పష్టం చేశారు.

అంతకుముందు రామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహించకముందే ఏపీ ప్రభుత్వం అందులో క్వారంటైన్ కేంద్రం నిర్వహించిందని, ఆ సమయంలో అగ్నిప్రమాదం జరిగివుంటే ప్రభుత్వాన్ని నిందించేవాళ్లా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నదని ముఖ్యమంత్రి ఓ లుక్కేయాలని హీరో రామ్ ఉచిత సలహా ఇచ్చాడు.

Related posts

ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు

Bhavani

నీలి విప్లవంతో వెలుగులు  

Murali Krishna

నితిష్ కు షాకిచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు

Satyam NEWS

1 comment

A B Kumar August 16, 2020 at 12:45 PM

నిన్ను గాక మొన్న వచ్చిన చిన్న హీరో రామ్.
అతనేదో చెబితే కూడా ఇంత వ్యాఖ్యానం అవసరమా?
ఇంత చొరవ పెద్ద హీరోల విషయంలో లేదేం?
నిన్న అతనెవరో తెలియదన్న పోలీసులు మరి ఈరోజు అవసరమైతే పిలుస్తాం..
ఆధారాలతో మాట్లాడాలి అనెలా అంటారు. మీడియా మీడియా గా ఉండట్లేదు..అతి ఎక్కువ అయింది.

Reply

Leave a Comment