నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసిన తర్వాత విచారణ వేగం చేసి జైలు శిక్ష పడటానికి ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు. దొంగతనం, మానభంగం, మహిళల వేధింపు, గంజాయి, నేర పూరిత కుట్రలు, మోసం, కబ్జాలు, దాడులు, హత్య, హత్యాయత్నం, ప్లాట్ల మోసం, డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన వారు, సాక్షులు, సంబంధం ఉన్న అధికారులకు శిక్షలు వేసి జైలుకు పంపడానికి కృషి చేయాలని, సెల్ ఫోన్ కాల్ డేటా, సిసి కెమెరాల పూటేజీ, వాయిస్ రికార్డును నేర విచారణకు ఇవ్వాలని నిజాయితీపరులు పోలీస్ వారిని కోరుతున్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్